
న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్), సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ)లకు కొత్త అధిపతులను కేంద్రం గురువారం నియమించింది. 1984 బ్యాచ్ ఉత్తర ప్రదేశ్ కేడర్‌కు చెందిన రజినీకాంత్ మిశ్రా బీఎస్‌ఎఫ్‌కు చీఫ్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన ఎస్‌ఎస్‌బీ చీఫ్‌గా ఉన్నారు. ప్రస్తుత బీఎస్‌ఎఫ్ చీఫ్ కేకే శర్మ ఈ నెలాఖరుకు పదవీ విరమణ పొందనుండటంతో ఆ స్థానాన్ని మిశ్రా భర్తీ చేసి, పదవీ విరమణ వరకు (2019 ఆగస్టు) కొనసాగనున్నారు. 1984 బ్యాచ్ హరియాణా కేడర్‌కు చెందిన మరో సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్‌ఎస్ దేశ్వాల్ మిశ్రా స్థానంలో ఎస్‌ఎస్‌బీ చీఫ్‌గా నియమితులై, పదవీ విరమణ పొందే వరకు (2021 ఆగస్టు) కొనసాగుతారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్ సిబ్బంది, నేపాల్ సరిహద్దులో ఎస్‌ఎస్‌బీ సిబ్బంది కాపలాగా ఉంటుడటం తెలిసిందే.