కిషన్ గంజ్: బీఎస్ఎఫ్ కు చెందిన ఓ జవాను శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీహార్ కు సమీపంలో భారత-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో విధులు నిర్వరిస్తున్న జనరాం అనే జవాను తన వద్ద నున్న సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని మృతిచెందాడు. రాజస్థాన్ రాష్ట్రంలో బర్మర్ ప్రాంతానికి చెందిన జనరాం విధుల్లోకి చేరి రెండు రోజులే అయ్యిందని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం కిషన్ గంజ్ లోని హెడ్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న అతని మృతికి గల కారణాలు తెలియలేదన్నారు.
తన సహచర ఉద్యోగులతో కలిసి మార్చ్ నిర్వహిస్తున్న క్రమంలో అతను తుపాకీతో కాల్చుకుని మృతిచెందినట్లు అధికారులు స్పష్టం చేశారు.