
మారుతి (ఫైల్)
సాక్షి, తాంసి (బోథ్): ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకోవాలంటూ భర్తను వదిలేసిన ఓ మహిళ వేధింపులు తట్టుకోలేక బీఎస్‌ఎఫ్ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో గురువారం చోటు చేసుకుంది. బెల్సరీ రాంపూర్ గ్రామానికి చెందిన గెడాం మారుతి (30) బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా మేఘాలయలోని 11వ బెటా లియన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. గత నెలలో సెలవుపై గ్రామానికి వచ్చాడు. ఈ సమయంలోనే మారుతికి కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే గతంలో పరిచయం ఉన్న పార్వతీబాయి అనే మహిళ మారుతిని ప్రేమిస్తున్నానంటూ, పెళ్లి చేసుకో వాలంటూ సమీప బంధువుతో కలసి వేధిస్తోంది.
బుధవారం గ్రామపెద్దల సమక్షంలో దీనిపై పంచాయితీ పెట్టారు. ఆ మహిళతో తనకు ఎలాంటి సంబంధం లేదని పెళ్లి చేసుకోనని చెప్పాడు. ఆమెసమీప బంధువుతో కలసి మారుతిపై కేసు పెడతామంటూ బెదిరించారు. మనస్తాపానికి గురైన మారుతి బుధవారం రాత్రి 8 గంటల సమయంలో బయటపడుకుంటానని చెప్పి ట్రాక్టర్‌లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం కుటుం బసభ్యులు గమనించగా అప్పటికే మృతి చెందాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పోలీసులు రిమ్స్‌కు తరలించారు. మృతుడి సోదరుడు సుదర్శన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment