
జమ్మూ: అకారణంగా తమ జవాన్‌ను పొట్టనబెట్టుకున్న పాకిస్తాన్ సైన్యంపై భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. భద్రతా దళాలు బుధవారం రాత్రి పాక్ ఆర్మీ పోస్టులపై మెరుపు దాడులు చేశాయి. సరిహద్దుల మీదుగా ఉన్న దాయాది సైనిక పోస్టులను ధ్వంసం చేసి.. దాదాపు 15మంది పాకిస్థాన్ రేంజర్లను హతమార్చారు.
బుధవారం సాయంత్రం పాక్ ఆర్మీ ఏకపక్షంగా కాల్పులకు దిగింది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకపోయినా.. ఏకపక్షంగా భారత సైన్యం లక్ష్మంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆర్పీ హజ్రా తీవ్రంగా గాయపడ్డారు. పుట్టినరోజు నాడే పాక్ కాల్పుల్లో గాయపడిన హజ్రా చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన భారత సైన్యంలో ప్రతీకారేచ్ఛను రగిలింది. సరిహద్దుల్లో పాక్ యథేచ్ఛగా కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ.. చిన్నపాటి ఆయుధాలు, మోటార్ షెల్స్ దాడులతో భారత సైన్యాన్ని కవ్విస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఆపరేషన్ నిర్వహించిన భారత్ సైన్యం సరిహద్దుల దాటి పాక్ పోస్టులను మూడింటిని ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్‌లో 12 నుంచి 15మంది పాక్ రేంజర్లు హతమైనట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment