
సైన్యం ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు
న్యూఢిల్లీ: మరోసారి జమ్మూకాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పాకిస్థాన్ ఉగ్రవాదులతో బుధవారం భీకరపోరు నెలకొంది. భారత సైన్యానకి పాక్ ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఎప్పుడూ ఆందోళన పరిస్థితి నెలకొనే బారాముల్లా జిల్లాలోనే ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. సరిగ్గా రఫియా బాద్ వద్ద ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.