పాక్ కాల్పుల్లో భారత జవాన్ మృతి..
Published Fri, Sep 15 2017 10:10 AM | Last Updated on Wed, Jul 25 2018 1:49 PM
సాక్షి, జమ్మూ: పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనను అతిక్రమించింది. దీంతో భారత బీఎస్‌ఎఫ్ జవాన్ మృతి చెందారు. శుక్రవారం జమ్మూ జిల్లాలోని దేశసరిహద్దులో విధులు నిర్వహిస్తున్న జవాన్ బిజేందర్ బహుదూర్(32) కు పాక్ సైన్యం షెల్లింగ్ మోర్టార్‌లు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతన్ని ఆర్మీ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందారు.
ఉత్తర్ ప్రదేశ్ బలియా జిల్లాలోని విద్యా భావన్ నారయపుర్ గ్రామానికి చెందని బహుదూర్‌కు భార్య సుశ్మితా సింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. గత మూడు రోజుల నుంచి వరుసగా పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. భారత బలగాలు సైతం పాక్ కాల్పులను తిప్పికొడుతున్నాయి. గురువారం కాల్పుల్లో ఇద్దరు పాక్ సైనికులు మరణించగా ముగ్గురు భారత జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని భారత ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.
Advertisement
Advertisement