సీఎం ఇంటి ఎదుట బీఎస్ఎఫ్ జవాను కాల్పులు | BSF jawan opens fire outside Omar Abdullah's residence in Srinagar | Sakshi
Sakshi News home page

సీఎం ఇంటి ఎదుట బీఎస్ఎఫ్ జవాను కాల్పులు

Published Mon, Nov 17 2014 11:01 AM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

సీఎం ఇంటి ఎదుట బీఎస్ఎఫ్ జవాను కాల్పులు - Sakshi

సీఎం ఇంటి ఎదుట బీఎస్ఎఫ్ జవాను కాల్పులు

జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇంటి వద్ద భద్రత కోసం నియమించిన బీఎస్ఎఫ్ జవాన్లలో ఒకరు సోమవారం ఉదయం ఉన్నట్టుండి కాల్పులు జరిపారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అతడు కాల్పులు ప్రారంభించగానే, సీఎం భద్రత కోసం ప్రత్యేకంగా నియమించిన ఎస్ఎస్జీ సభ్యులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

బీఎస్ఎఫ్ జవాను తన ఇంటి ముందు కాల్పులు జరిపినా.. తన భద్రతా బృందం విషయంలో తనకు పూర్తి విశ్వాసం ఉందని అబ్దుల్లా ట్వీట్ చేశారు. కాల్పులు జరిపిన జవానును తాము ప్రశ్నించామని, అతడి మానసిక స్థితి సరిగా లేనట్లు అనిపిస్తోందని పోలీసులు చెప్పారు. పొద్దున్నే కాల్పుల శబ్దాలు వినిపించడంతో ఏమైందా అని ఉలిక్కిపడి లేచినట్లు ముఖ్యమంత్రి నివాసానికి చుట్టుపక్కల ఉన్నవాళ్లు చెప్పారు. బహుశా ఉగ్రవాదులు ఎవరైనా దాడి చేశారేమోనని భావించామన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement