న్యూఢిల్లీ: ఉధంపూర్ ఎన్ కౌంటర్ లో వీర మరణం పొందిన బీఎస్ఎప్ జవాన్ రాకీ అంత్యక్రియలను శుక్రవారం అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. హర్యానా రాష్ట్రంలోని రాకీ స్వగ్రామం రామ్ గర్ మజ్రాలో అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగా రాకీ భౌతికకాయానికి పలువురు అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఇటీవలే బీఎస్ఎఫ్ లో చేరిన రాకీ.. రెండు రోజుల క్రితం ఉగ్రదాడిలో సహచరుల ప్రాణాలు కాపాడి తాను ప్రాణాలు కోల్పోయాడు. ఉగ్రవాదుల దాడిలో తనకు బుల్లెట్ గాయాలైనా తట్టుకుని.. తన తుపాకీలోని 40 బుల్లెట్లు ఖాళీ అయేంతవరకు వారిపై తూటాలవర్షం కురిపించాడు. తన యూనిట్ ‘రాక్‌ఫోర్స్ పేరు తెచ్చుకున్న రాకీ.. పేరుకు తగ్గట్లే వీరోచితంగా, హీరోలా పోరాడి చివరకు తుదిశ్వాస విడిచాడు.
అధికారిక లాంఛనాలతో రాకీ అంత్యక్రియలు
Published Fri, Aug 7 2015 11:20 AM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM
Advertisement
Advertisement