విజయనగరం: మండలంలోని చినభోగిలి గ్రామానికి చెందిన బీఎస్‌ఎఫ్ జవాన్ నగర ప్రసాద్(44) అనారోగ్యంతో బాధపడుతూ విశాఖపట్నంలోని ఆస్పత్రిలో మంగళవారం మృతిచెందారు. ప్రసాద్ మృతదేహాన్ని సాయంత్రం స్వగ్రామం చినభోగిలికి కుటుంబీకులు తీసుకొచ్చారు. బుధవారం జరిగిన ఆయన అంత్యక్రియల్లో బోర్డర్ సెక్యూరిటీ సిబ్బంది, స్థానిక అధికారులు పాల్గొని అధికారిక లాంఛనాలతో నిర్వహించి వీడ్కోలు పలికారు.
ముందుగా ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం శ్మశాన వాటిక వద్ద బీఎస్‌ఎఫ్‌కు చెందిన కమాండెంట్, అసిస్టెంట్ కమాండెంట్, సిబ్బంది పాల్గొని ఆయన భార్యకు జాతీయ పతాకాన్ని అందజేశారు. గార్డు ఆఫ్ హానర్ కార్యక్రమాన్ని నిర్వహించాక అంత్యక్రియలు పూర్తిచేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎన్వీరమణ, ఎస్సై కె.నీలకంఠం, ఆర్‌ఐ ఎన్.శ్రీనివాసరావు, సర్పంచ్ కురమాన రాధ, గ్రామ వీఆర్‌ఓ ఎస్ లక్ష్మి, కుటుంబ సభ్యులు,స్నేహితులు, గ్రామప్రజలు పాల్గొన్నారు.
కుటుంబసభ్యుల రోదన
ప్రసాద్ గుజరాత్ రాష్ట్రంలోని పనిచేస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. 23ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రసాద్ సెలవుపై జూలై 30న ఇంటికి చేరుకున్నారని భార్య తెలిపారు. మృతి చెందిన ప్రసాద్‌కు తల్లిదండ్రులు గంగయ్య, సీతమ్మతో పాటు భార్య పవిత్ర, కుమారుడు అక్షయ్ కుమార్, కుమార్తె ఉన్నారు. కుటుంబాన్ని పోషిస్తున్న ప్రసాద్ మృతిచెందడాన్ని జీర్ణించుకోలేకోపోయిన కుటుంబసభ్యులు భోరున విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment