గర్భధారణ సమయంలో గుండెల్లో వచ్చే మంట ప్రమాదమా..? How Can I Deal With Heartburn During Pregnancy | Sakshi
Sakshi News home page

గర్భధారణ సమయంలో గుండెల్లో వచ్చే మంట ప్రమాదమా..?

Published Mon, Aug 7 2023 11:30 AM | Last Updated on Mon, Aug 7 2023 11:30 AM

How Can I Deal With Heartburn During Pregnancy - Sakshi

గర్భవతుల్లో గుండెల్లో లేదా ఛాతీలో మంటగా ఉండటం, తేన్పులు, అజీర్తి ఫీలింగ్‌... ఇవన్నీ చాలా సాధారణంగా కనిపించే సమస్యలు. అయితే స్త్రీ, పురుషులు అనే భేదం లేకుండా చాలామందిలో ఈ సమస్య కనిపించినప్పటికీ గర్భవతుల్లో... మరీ ముఖ్యంగా ఐదారు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు ఈ లక్షణాలు ఎక్కువ. 

ఎందుకు వస్తుందంటే..
కారణాలివి... గర్భవతుల్లో ప్లాసెంటా నుంచి ప్రోజెస్టెరాన్‌ హార్మోన్‌ ఉత్పత్తి అవుతుంటుంది. నెలలు నిండుతూ గర్భసంచిలో పిండం పెరుగుతున్న కొద్దీ... దానికి మరింతగా చోటు కల్పించడానికి గర్భసంచి కండరాలు వదులయ్యేలా చేయడం కోసం ప్రకృతిపరమైన ఏర్పాటిది. ఈ హార్మోన్‌ కేవలం గర్భసంచినే కాకుండా జీర్ణాశయం–అన్నవాహిక మధ్యన ఉండే ‘లోవర్‌ ఈసోఫేజియల్‌ స్ఫింక్టర్‌’పైనా  ప్రభావం చూపుతుంది. దాంతో ఆ స్ఫింక్టర్‌ వదులై, జీర్ణరసాలు పైకి ఎగజిమ్మడంతో గర్భవతుల్లో ఈ సమస్య కనిపిస్తుంది.

నివారణ:

  • ఆహారంలో కారం, మసాలాలూ, వేపుళ్లు పరిమితంగా తీసుకోవాలి. మజ్జిగ, పెరుగు వంటివి తీసుకోవాలి
  • ఒకేసారి ఎక్కువ మోతాదుల్లో కాకుండా చిన్న చిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు తినాలి
  • భోజనం పూర్తికాగానే పడుకోకూడదు. కాసేపు అటూ ఇటూ తిరగాలి∙
  • పడుకునే సమయంలో తలగడ పెట్టుకుని, తల కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి
  • అప్పటికీ సమస్య తగ్గకపోతే డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే యాంటాసిడ్స్‌ వాడాలి.  

(చదవండి: కరోనా తెచ్చిన తంటా! పిల్లల్ని ఫోన్లకు అడిక్ట్‌ కాకుండా ఏం చేయాలి?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement