
అత్యవసర శస్త్ర చికిత్స చేస్తుండగా ఏకంగా 25 నిమిషాల పాటు గుండె ఆగిపోయింది. అయినా మత్యుంజయుడై బయటపడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ భయానక ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే..యూకేకి విశ్వవిద్యాలయ విద్యార్థి చార్లీ విన్సెంట్ యూఎస్‌లో న్యూ హాంప్‌షైర్‌లోని వేసవి శిబిరంలో కానోయింగ్ బోధకుడిగా పనిచేస్తున్నాడు. ఆరోజు అధిక సూర్యరశ్మీ అతని కాళపై పడటంతో కాలిన గాయాల బారిన పడ్డాడు. అయితే అతడు దీన్నేం పట్టించుకోకుండా పనిచేస్తూనే ఉన్నాడు. చివరికి వడదెబ్బకు ురై ఆస్పత్రిపాలయ్యాడు. అక్కడ వైద్య పరీక్షలో అతడికి న్యూమోనియా ఉన్నట్లు నిర్థారించారు. దీంతో అతడికి అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. ఆ క్రమంలో అతడికి స్ట్రోక్ రావడం ఏకంగా 25 నిమిషాల పాటు గుండె ఆగిపోవడం జరిగింది.
వైద్యులు సైతం పరిస్థితి చేయి దాటిందనే అనుకున్నారు. ఆశ్చర్యకరంగా అతడి గుండె యథాస్థితికి వచ్చిన పనిచేయడం ప్రారంభమయ్యింది. ఈ రికవరీని వైద్యులు అద్భుతంగా అభివర్ణించారు. దీనిని కార్డియోమొగలీ అని పిలుస్తారని వైద్యులు అన్నారు. అంటే ఇక్కడ గుండె సాధారణం కంటే ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ 20 ఏళ్ల యువకుడిని దాదాపు ఏడు రోజుల పాటు ప్రేరేపిత కోమాలో ఉంచి చికిత్స అందించారు. మొదట్లో వైద్యులు భయపడిపోయారు. ఎందుకంటే.. ఇక్కడ ఆ వ్యక్తి గుండె, మూత్రపిండాల మార్పిడి అవసరమవ్వడంతో బతికే అవకాశాలు తక్కువని భావించారు వైద్యులు.
అలాంటిది అనూహ్యంగా అన్ని అవయవాలు అద్భుతంగా కోలుకుని పనిచేయడం ప్రారంభించడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు వైద్యులు. ఈ మేరకు అతడి చికిత్స అందించిన వైద్యులు మాట్లాడుతూ..ఒకానొక సమయంలో చార్లీ బతికే అవకాశాలు లేవని అనిపించేలా ఉత్కంఠగా ఉంది పరిస్థితి. అతడు అద్భుతంగా తిరిగి కోలుకోవడం మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపించిదని అన్నారు. సదరు బాధితుడు చార్లీ ఇప్పుడిప్పుడే కోలుకుంటూ నెమ్మదిగా అడుగులు వేయడం ప్రారంభించాడు.
(చదవండి: బిడ్డకు తల్లయినా ఎంతో ఫిట్‌గా ఆలియా.. సీక్రెట్ ఏంటంటే?)
Comments
Please login to add a commentAdd a comment