![Heart valves with triple printing tech - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/12/printed-heart-valves-1.jpg.webp?itok=vpDMNyFK)
ఫొటోలో కనిపిస్తున్నవి.. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా తయారు చేసిన గుండె కవాటాలు.. హార్వర్డ్ యూనివర్సిటీలోని వైస్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తల ఈ ఘన విజయం పుణ్యమా అని సమీప భవిష్యత్తులో గుండె జబ్బుల కారణంగా దెబ్బతిన్న కవాటాలను సురక్షితంగా మార్చేయవచ్చు. గుండె కొట్టుకునే క్రమంలో కవాటాలు తెరుచుకుంటూ మూసుకుంటూ ఉంటాయన్న విషయం మనకు తెలుసు. అయితే కొన్ని సందర్భాల్లో క్యాల్షియం వంటివి పేరుకుపోయినప్పుడు ఈ కవాటాలు తమ పని తాము సక్రమంగా చేయలేవు.
అటువంటి పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు కృత్రిమ కవాటాలను అమరుస్తున్నా, వాటి పనితీరు సందేహాస్పదంగా ఉండేది. ఈ నేపథ్యంలో వైస్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ సాయంతో కవాటాల లోపల ఉండే లీఫ్‌లెట్స్ భాగాలను గుర్తించి ముద్రించేందుకు కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. రక్తప్రసరణ నియంత్రణలో ఈ లీఫ్‌లెట్స్‌దే ముఖ్యమైన పాత్ర. సీటీ స్కాన్ వివరాలను ఆధారంగా చేసుకుని అతి సూక్ష్మమైన ఈ లీఫ్‌లెట్స్ ఆకారం, సైజులను కచ్చితంగా అంచనా కట్టడం ఈ సాఫ్ట్‌వేర్ ప్రత్యేకత. ఇప్పటికే కృత్రిమ కవాటాలు అమర్చుకున్న కొంతమంది వివరాలను సేకరించి కొత్త త్రీడీ కవాటాలను సృష్టించి పరీక్షించినప్పుడు కొత్తవి బాగా అమరినట్లు ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment