Viral Photo: స్టూడెంట్ రాక్, టీచ‌ర్ షాక్‌.. గుండె నిండా అమ్మాయిలే Student Heart Diagram Linked to Crush Leaves Netizens in Stitches | Sakshi
Sakshi News home page

స్టూడెంట్ రాక్, టీచ‌ర్ షాక్‌.. గుండె నిండా అమ్మాయిలే

Published Fri, Jun 21 2024 3:51 PM | Last Updated on Fri, Jun 21 2024 6:18 PM

Student Heart Diagram Linked to Crush Leaves Netizens in Stitches

ఇంట‌ర్నెట్‌, సోష‌ల్ మీడియా వినియోగం పెరిగిన త‌ర్వాత ప్ర‌పంచంలో జ‌రిగే అన్ని విష‌యాలు చిటికెలో అంద‌రికీ తెలిసిపోతున్నాయి. టెక్నాల‌జీ, ఇన్ఫ‌ర్మేష‌న్‌, కామెడీ, ఫ‌న్నీ విష‌యాలు ఎప్ప‌టిక‌ప్పుడుసామాజిక మాధ్యామాల్లో వైర‌ల్‌గా మారుతున్నాయి. తాజాగా ఓ విద్యార్ధి ప‌రీక్ష‌లో రాసిన స‌మాధానం నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ప‌రీక్ష‌ల్లో అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం తెలియ‌ని స‌మ‌యంలో చాలా మంది విద్యార్ధులు సినిమా పాట‌లు, సంబంధం లేని క‌థ‌లు రాస్తుంటారు. అయితే ఓ ఓ విద్యార్థి పరీక్షలో రాసిన జవాబును చూసి టీచర్‌ షాక్‌ అయ్యారు. గుండె బొమ్మ వేసి, దాని పనితీరును రాయమని అడిగిన ప్రశ్నకు ఆ విద్యార్థి గుండె బొమ్మను స‌రిగానే వేశాడు కానీ.. కాని అందులోని నాలుగు గదులను వివ‌రించే బ‌దులు వాటిని ఐదుగురు అమ్మాయిలకు అంకితం చేశాడు.

గుండెలోని  భాగాల పేర్లకు బదులుగా నాలుగు గదుల్లో హరిత, ప్రియ, పూజ, రూప, నమిత అంటూ పేర్లు రాశాడు.. అంతేకాదు గుండె పనితీరు స్థానంలో ఆ అమ్మాయిలు అత‌నికి ఏ విధంగా  సంబంధమో  వివరించాడు.

ప్రియ తనతో ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేస్తుందని, ఆమెను ఇష్టపడుతున్నాడని రాశాడు. ఇక రూప అందంగా క్యూట్‌గా ఉంటుంద‌ని,  స్నాప్‌చాట్‌లో  తనతో టచ్‌లో ఉంటుంద‌ని  పేర్కొన్నాడు. ప‌క్కింట్లో  ఉండే నమిత పొడవాటి జుట్టు, పెద్దపెద్ద కళ్లతో తనను ఆకర్షిస్తుందని తెలిపాడు. పూజ తన మాజీ ప్రేమికురాలని, ఆమెను ఎప్పటికీ మరచిపోలేనని కన్నీరు కారుస్తున్న ఎమోజీని జత చేశాడు. చివరిగా  హరిత తన క్లాస్‌మేట్ అని పేర్కొన్నాడు.

ఆ సమాధానం చదివిన టీచర్‌ జవాబును కొట్టివేసి గుండె బొమ్మకు మాత్రం మార్కులు వేశారు. అతడి తల్లిదండ్రులను స్కూల్‌కు తీసుకురావాల్సిందిగా ఆ విద్యార్థిని ఆదేశించారు. దీనిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఇది ఎక్క‌డ జ‌రిగిందో మాత్రం తెలియ‌రాలేదు,

విద్యార్థి రాసిన జవాబును చూసి నెటిజన్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. . ‘స్టూడెంట్‌ రాక్‌.. టీచర్ షాక్‌’ అంటూ ఓ నెటిజన్ కామెంట చేయ‌గా... ‘గుండె బొమ్మను బాగా గీసినందుకు మరో రెండు మార్కులు ఇచ్చి ఉండొచ్చు కదా’ అంటూ మరో నెటిజన్‌ స్పందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement