girls names
-
Function of the Heart: విశాల హృదయం
క్వశ్చన్ పేపర్లో ‘గుండె బొమ్మ గీసి వివిధ భాగాలను వివరించుము’ అనే ప్రశ్నను చూసిన స్టూడెంట్ మహాశయుడు ఎక్కడికో వెళ్లిపోయాడు. గుండె బొమ్మను కలర్ఫుల్గా గీయడం వరకు ఓకే. అయితే ఆ గుండెలో వివిధ భాగాలలో తాను ప్రేమించిన అమ్మాయిల పేర్లు రాశాడు. ప్రియా, నమిత, హరిత, రూప, పూజలాంటి పేర్లు రాశాడు. మరో అడుగు ముందుకు వేసి ‘ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్’ అనే హెడ్‌లైన్‌తో వారిని తాను ఎందుకు ప్రేమిస్తున్నానో రాశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజనులను నవ్వులలో ముంచెత్తుతుంది. -
Viral Photo: స్టూడెంట్ రాక్, టీచర్ షాక్.. గుండె నిండా అమ్మాయిలే
ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు చిటికెలో అందరికీ తెలిసిపోతున్నాయి. టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్, కామెడీ, ఫన్నీ విషయాలు ఎప్పటికప్పుడుసామాజిక మాధ్యామాల్లో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఓ విద్యార్ధి పరీక్షలో రాసిన సమాధానం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.పరీక్షల్లో అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియని సమయంలో చాలా మంది విద్యార్ధులు సినిమా పాటలు, సంబంధం లేని కథలు రాస్తుంటారు. అయితే ఓ ఓ విద్యార్థి పరీక్షలో రాసిన జవాబును చూసి టీచర్ షాక్ అయ్యారు. గుండె బొమ్మ వేసి, దాని పనితీరును రాయమని అడిగిన ప్రశ్నకు ఆ విద్యార్థి గుండె బొమ్మను సరిగానే వేశాడు కానీ.. కాని అందులోని నాలుగు గదులను వివరించే బదులు వాటిని ఐదుగురు అమ్మాయిలకు అంకితం చేశాడు.గుండెలోని భాగాల పేర్లకు బదులుగా నాలుగు గదుల్లో హరిత, ప్రియ, పూజ, రూప, నమిత అంటూ పేర్లు రాశాడు.. అంతేకాదు గుండె పనితీరు స్థానంలో ఆ అమ్మాయిలు అతనికి ఏ విధంగా సంబంధమో వివరించాడు.ప్రియ తనతో ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేస్తుందని, ఆమెను ఇష్టపడుతున్నాడని రాశాడు. ఇక రూప అందంగా క్యూట్‌గా ఉంటుందని, స్నాప్‌చాట్‌లో తనతో టచ్‌లో ఉంటుందని పేర్కొన్నాడు. పక్కింట్లో ఉండే నమిత పొడవాటి జుట్టు, పెద్దపెద్ద కళ్లతో తనను ఆకర్షిస్తుందని తెలిపాడు. పూజ తన మాజీ ప్రేమికురాలని, ఆమెను ఎప్పటికీ మరచిపోలేనని కన్నీరు కారుస్తున్న ఎమోజీని జత చేశాడు. చివరిగా హరిత తన క్లాస్మేట్ అని పేర్కొన్నాడు.ఆ సమాధానం చదివిన టీచర్ జవాబును కొట్టివేసి గుండె బొమ్మకు మాత్రం మార్కులు వేశారు. అతడి తల్లిదండ్రులను స్కూల్‌కు తీసుకురావాల్సిందిగా ఆ విద్యార్థిని ఆదేశించారు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఇది ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు,విద్యార్థి రాసిన జవాబును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. . ‘స్టూడెంట్ రాక్.. టీచర్ షాక్’ అంటూ ఓ నెటిజన్ కామెంట చేయగా... ‘గుండె బొమ్మను బాగా గీసినందుకు మరో రెండు మార్కులు ఇచ్చి ఉండొచ్చు కదా’ అంటూ మరో నెటిజన్ స్పందించారు. -
అక్కడి ఇళ్లకు ఆడ పిల్లల పేర్లతో నేమ్ ప్లేట్లు
రాంచి: అదో గిరిజనుల గ్రామం. పేరు టిరింగ్. జార్ఖండ్ రాష్ట్రంలోని సింగ్భమ్ జిల్లాలో ఉంది. ఆ గ్రామంలో 170 కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రతి ఇంటికి ఓ నేమ్‌ప్లేట్ ఉంటుంది. దానిపై పెళ్లికాని ఆడపిల్లల పేర్లు లేదా వారి తల్లుల పేర్లు మాత్రమే ఉంటాయి. ఇంటి యజమాని పేరుగానీ, మగవాళ్ల పేర్లుగానీ ఏ ఇంటికి కనిపించవు. ఆడవాళ్ల పేర్లతోనే అక్కడి ఇంటి చిరునామాలను గుర్తిస్తారు. ఇలా ప్రతి ఇంటికి ఆడవాళ్ల పేర్లు కలిగిన గ్రామం దేశంలో ఇదొక్కటేనని జిల్లా అధికారులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం 170 కుటుంబాల ఇళ్లలో 61 ఇళ్లకు పెళ్లికాని ఆడపిల్లల నేమ్ ప్లేట్లు ఉండగా, మిగతా ఇళ్లకు తల్లుల పేర్లు ఉన్నాయి. గ్రామంలో ఏటేటా పడిపోతున్న ఆడపిల్లల సంఖ్యను, ఆడపిల్లల్లో అక్షరాస్యతను ప్రోత్సహించడం కోసమే గ్రామస్థులు ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వెయ్యి మంది మగ శిశువులు నమోదుకాగా, 786 మంది ఆడ శిశువుల సంఖ్య నమోదైంది. గ్రామంలోని మహిళల్లో అక్షరాస్యత 50.6 శాతం మాత్రమే ఉంది. గ్రామం ఈ వినూత్న నిర్ణయాన్ని అమలు చేస్తున్నప్పటి నుంచి గ్రామంలో ఆడ శిశువుల సంఖ్య పెరుగుతుండడమే కాకుండా ఆడవాళ్లలో ఆక్షరాస్యత కూడా పెరుగుతూ వస్తోందని జిల్లా పౌర సంబంధాల అధికారి సంజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ కింద రేషన్ సరకులను తీసుకునేందుకు కుటుంబంలోని సీనియర్ మహిళ పేరును ఇంటి యజమానిగా తప్పనిసరి నమోదు చేయాలంటూ 2013లో కేంద్రం జాతీయ ఆహార భద్రతా చట్టం తీసుకరావడం కూడా వారి పాలిట వరమైంది. అంతకుముందు ఇంటి యజమానిగా మగవారి పేర్లను మాత్రమే నమోదు చేయాల్సి ఉండేది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ‘బేటీ బచావో బీటే పడావో’ తరహాలో తాము మై డాటర్ ఈజ్ మై ఐడెంటిటి అనే నినాదం ఇప్పుడు ఈ గ్రామం నుంచి ప్రారంభమైందని జిల్లా డిప్యూటి కలెక్టర్ సంజయ్ పాండే తెలిపారు. శక్తికి, ఆశావహ దృక్పథానికి చిహ్నంగా ఇక్కడి ఇళ్ల నేమ్ ప్లేట్లకు పసుపు రంగును వాడుతున్నారు. వాటిపైనా బాలికలు, తల్లుల పేర్లను నీలి రంగులో రాస్తున్నారు.