గుండెజబ్బులను నివారించడానికి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్‌లో భాగంగా డాక్టర్లు చాలా రకాల మార్గాలు సూచిస్తుంటారు. అందులో పండ్లు తినడమూ ఒకటి. అయితే కొన్ని రకాల పండ్లు చాలా రుచిగా ఉండటంతోపాటు, వాటిలో ఉండే కొన్ని రకాల పోషకాల వల్ల గుండెకు పటిష్టమైన రక్షణనిస్తాయి. వాటితోపాటు పూర్తి ఆరోగ్యానికీ తోడ్పడతాయి. అలా గుండెకు మేలు చేయడానికి వాటిల్లోని ఏయే పోషకాలూ, ఏయే అంశాలు ఉపయోగపడతాయో చూద్దాం. అన్ని చోట్లా దొరుకుతూ, అన్ని వేళలా లభ్యమయ్యే పండ్లలో అరటి, నారింజ, ఆపిల్ వంటివి చాలా ముఖ్యం. అలా గుండెకు మేలు చేసే ఆల్ సీజన్ పండ్ల గురించి తెలుసుకుందాం.
అరటి పండు: ఈ పండులోని పొటాషియమ్, మెగ్నీషియమ్‌లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. హైబీపీ అన్నది గుండె΄ోటుకు ఒక రిస్క్‌ఫ్యాక్టర్ కాబట్టి అరటిలోని పొటాషియమ్ హైబీపీని తగ్గించడం ద్వారా పరోక్షంగా గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. అలా అరటి గుండె΄ోటును నివారిస్తుంది. ఈ పండు కేవలం రక్త΄ోటును అదుపు చేయడం, గుండె΄ోటు నివారించడమే కాకుండా... ఇందులోని విటమిన్ బి6, విటమిన్ – సి, పీచుపదార్థాలు దేహానికీ మేలు చేస్తాయి. ఇవి మార్కెట్లో ఎప్పుడూ దొరుకుతూనే ఉండటమన్నది ఓ సానుకూల అంశం.
ద్రాక్ష: మన దేహంలో ఆయా అవయవాల ఆకృతికి దగ్గరిగా మంచి పోలిక కలిగి ఉండే పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్ వంటివి ఆయా దేహ భాగాలకు మేలు చేస్తాయనే భావన చాలామందిలో ఉంది. ఉదాహరణకు ఆక్రోట్ వంటివి మెదడుకు ఆకారంలో ఉండి మెదడుకు మేలు చేస్తాయనీ... అలాగే అడ్డుగా కోసినప్పుడు అచ్చం కన్నులోని నల్లగుడ్డులో ఉన్నట్లుగా రింగులు కనిపించే క్యారట్ కన్నుకు మేలు చేస్తుందంటారు. అలాగే ద్రాక్షగుత్తిని చూసినప్పుడు... ఆ పండ్లు ఉండే ఈనెలన్నీ దేహంలోని రక్తప్రసరణ వ్యవస్థలో ఉండే రక్తనాళాల్లా కనిపిస్తాయి. ఈ కారణం చేత ద్రాక్ష పండు గుండెకు మంచిదని అంటుంటారు.
ద్రాక్షగుత్తి మొత్తాన్ని చూసినప్పుడు కూడా అది గుండె ఆకృతిలోనే ఉంటుంది. నిర్దిష్టంగా చూస్తే పండు ఆకృతి కీ, అది చేసే మేళ్లకూ సైంటిఫిక్‌గా ఎలాంటి నిదర్శనాలూ లేవు. అయినప్పటికీ కాకతాళీయంగానైనా ఇది రక్తనాళాల్లోని కొవ్వులను తొలగిస్తుంది. ద్రాక్షపండ్లు మన రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండె΄ోటు అవకాశాలను నివారిస్తాయి. ద్రాక్షలోని పోషకాలైన లినోలిక్ ఆసిడ్, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ ఆలిగోమెరిక్ ప్రోయాంథో సయానిడిన్స్ వంటివి హైకోలెస్ట్రాల్‌ను తగ్గించి, అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. తద్వారా గుండెజబ్బులను నివారిస్తాయి.
నారింజపండ్లు: నిమ్మజాతికి చెందిన నారింజ, బత్తాయి వంటి పండ్లన్నీ గుండెకు బాగా మేలు సమకూర్చేవే. బాగా పండిన నారింజలో విటమిన్‌ఏ, బి6, సి పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు ఫోలేట్ పొటాషియమ్, ఫైబర్ ఎక్కువ. పొటాషియమ్ వల్ల రక్తపోటు తగ్గుతుందనీ దాంతో గుండెకు రక్షణ కలుగుతుందన్న విషయం తెలిసిందే. ఇవి కూడా ఏ సీజన్‌లోనైనా దొరకే పండ్లు కావడం ఓ మంచి విషయం.
ఆపిల్ : ఇందులోని ఫ్లేవనాయిడ్స్ రక్తనాళాల్లోని ప్లేట్‌లెట్లు రక్తనాళాల గోడలకు అంటుకోకుండా చూస్తాయి. దాంతో΄ాటు రక్తనాళాలు మూసుకు΄ోకుండా చూడటం, కొలెస్టాల్‌ను తగ్గించడం కూడా చేస్తాయి. ఇలా అవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
కర్బూజ (కాంటలౌప్) : ఈ పండ్లలోని ΄÷టాషియమ్ రక్త΄ోటును నియంత్రించి గుండె΄ోటును నివారిస్తుంది. ఈ పండ్లలోని విటమిన్–ఏ, విటమిన్–బి6, ఫోలేట్, పీచుపదార్థాలు పూర్తి శరీర ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
అన్ని చోట్లా దొరికే ద్రాక్ష, అరటి, నారింజ, ఆపిల్‌తోపాటు దాదాపుగా పట్టణ, నగర ప్రాంతాల్లోని పెద్ద పెద్ద మార్కెట్లలో దొరకే మరికొన్ని పండ్లు కూడా గుండెకు మేలు చేస్తాయి. వాటిలో కొన్ని...
బెర్రీపండ్లు: బెర్రీ పండ్లలో కూడా పొటాషియమ్ ఎక్కువగానే ఉంటుంది. పొటాషియమ్ రక్త΄ోటును నివారించడం ద్వారా గుండెకు మేలు చేస్తుందని అరటిపండు విషయంలో చూశాం కదా. అందుకే ఇది కూడా అరటి మాదిరిగానే గుండెకు మేలు చేస్తుంది. ఇక బెర్రీపండ్లలోని బ్లాక్‌బెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్‌బెర్రీలలో ఉండే విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ అన్నీ పూర్తి శరీర ఆరోగ్యానికి దోహదపడతాయి.
కివీ: ఇప్పుడు నగర ప్రాంతాల్లోని పెద్దపెద్ద మార్కెట్ల తోపాటు పట్టణ ప్రాంతాల్లోనూ కివీ పండ్లు దొరుకుతున్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పతాయి. కివీలోని విటమిన్–ఈ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఫలితం గా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే గుణం తగ్గి గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
అప్రికాట్: ముదురు నారింజ లేదా పసుపు రంగులో ఉండే అప్రికాట్స్ గుండెకు మంచివి. ఇందులో ఉండే విటమిన్–కె – రక్తకణాల ఆరోగ్యానికి దోహదపడుతుంది. అంతేకాదు అప్రికాట్‌లో ఉండే విటమిన్– ఏ, విటమిన్– సీ, విటమిన్–ఈ వల్ల పూర్తి శరీర ఆరోగ్యం కూడా బాగుపడుతుంది.
పైన పేర్కొన్నవాటి తోపాటు బ్రైట్‌గా ఉండి ముదురురంగుల్లో మెరుస్తున్నట్లు కనిపించే రంగులతో ఉండే పండ్లన్నీ గుండెకు మేలు చేసేవే. ఆపిల్ ఈ కోవలోనిదే. ఇక పండ్ల తోపాటు మిగతాజీవనశైలి మార్గాలను సైతం పాటిస్తూ ఉంటే గుండె ఆరోగ్యం పదికాలాలపాటు పదిలంగా ఉంటుంది.
∙
Comments
Please login to add a commentAdd a comment