గుండెకు చేటు తెచ్చే ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించుకోండి! లేదంటే.. | How To Manage High Triglyceride Levels | Sakshi
Sakshi News home page

గుండెకు చేటు తెచ్చే ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించుకోండి! లేదంటే..

Published Sun, Sep 24 2023 10:46 AM | Last Updated on Sun, Sep 24 2023 10:46 AM

How To Manage High Triglyceride Levels - Sakshi

ట్రైగ్లిజరైడ్స్‌ అన్నవి కొలెస్ట్రాల్‌లాగానే రక్తంలోని ఒక రకం కొవ్వులని చెప్పవచ్చు. ఇవి ఉండాల్సిన మోతాదు పెరిగితే ఆ కండిషన్‌ను ‘హైపర్‌ట్రైగ్లిజరైడెమియా’ అంటారు. వీటి మోతాదులు పెరగడం గుండె జబ్బులకు దారితీయవచ్చు.

ట్రైగ్లిజరైడ్స్‌ తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రక్తంలో ట్రైగ్లిజరైడ్‌ మోతాదులు ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని ఆహార నియమాలు పాటించడం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు. 

  • రక్తంలో ట్రైగ్లిజరైడ్స్‌ ఉన్నప్పుడు జీవనశైలిలో మార్పులు తప్పనిసరిగా పాటించాలి.
  • బరువు ఎక్కువగా ఉన్నవారు దాన్ని అదుపు చేసుకునేలా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అంటే తీసుకునే క్యాలరీల (క్యాలరీ ఇన్‌టేక్‌)ను తగ్గించుకోవాలి.
  • ఆహారంలో కొవ్వుల్ని... అంటే శాచ్యురేటెడ్‌ ఫ్యాట్‌ను, కొలెస్ట్రాల్‌ మోతాదులను బాగా తగ్గించాలి. ఉదాహరణకు... నెయ్యి, వెన్న, వూంసాహారం (రొయ్యలు, చికెన్‌ స్కిన్‌), వేపుళ్లను బాగా తగ్గించాలి.
  • తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్‌లో పీచు ఎక్కువగా ఉంటుంది. అవి ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించడంలో బాగా తోడ్పడతాయి. వాటితో పాటు వెజిటబుల్‌ సలాడ్స్, తేలిగ్గా ఉడికించిన కాయగూరలు తీసుకోవడమూ మంచిదే.
  • స్వీట్స్, బేకరీ ఐటమ్స్‌ బాగా తగ్గించాలి.
  • పొట్టు తీయని ధాన్యాలు (అంటే... దంపుడు బియ్యం, మెుక్కజొన్న, పొట్టుతీయని రాగులు, గోధువులు, ఓట్స్‌), పొట్టుతీయని పప్పుధాన్యాలు, మొలకెత్తిన గింజలు (స్ప్రోట్స్‌) తీసుకోవాలి.
  • ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు  శారీరక శ్రవు / వాకింగ్‌ వంటి వ్యాయావూలు చేయాలి.
  • కొవ్వులు ఎక్కువగా ఉండే రెడ్‌మీట్‌ను పూర్తిగా మానేయాలి. అయితే మాంసాహారాన్ని ఇష్టపడే వారు వారంలో వుూడుసార్లు చేపలు తీసుకోవచ్చు. అది కూడా కేవలం ఉడికించి వండినవీ, గ్రిల్డ్‌ ఫిష్‌ వూత్రమే తీసుకోవాలి. డీప్‌ ఫ్రై చేసినవి తీసుకోకూడదు∙
  • పొగతాగే అలవాటునూ, ఆల్కహాల్‌ను పూర్తిగా వూనేయాలి.  

(చదవండి: రక్తంలో ట్రైగ్జిజరైడ్స్‌ను తగ్గించుకోవాలంటే..ఇలా చేయండి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement