
మాక్రోఫేగస్ అనే ప్రత్యేక కణాలు గుండెజబ్బుతో దెబ్బతిన్న గుండెకు మరమ్మతు చేసేందుకు.. కొన్ని సందర్భాల్లో మళ్లీ ఆరోగ్యకరంగా మార్చేందుకు ఉపయోగపడతాయని గుర్తించారు పీటర్ మంక్ కార్డియాక్ సెంటర్ శాస్త్రవేత్తలు. పసిపిల్లల్లోని కణాల మాదిరిగా వ్యవహరించే ఈ మాక్రోఫేగస్‌లు గుండెజబ్బు తరువాత పసిపిల్లల్లో మాదిరిగానే అవయవాల ఎదుగుదలకు ఉపయోగపడతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త లొరెట్టా రోగర్స్ తెలిపారు. అయితే శరీరంలో మొత్తం నాలుగు రకాల మాక్రోఫేగస్‌లు ఉన్నాయని... గుండెజబ్బు తరువాత వీటి సంఖ్య 11కు చేరుతుందని తాము పరిశోధనల్లో గుర్తించామని చెప్పారు.
గుండెజబ్బు తరువాత ముందుగా పసిపిల్లల స్థాయిలో ఉండే మాక్రోఫేగస్‌లు నాశనమవుతాయని... పసిపిల్లల్లో మాత్రం వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతాయని తద్వారా రక్తనాళాలు, గుండె కండరాలు ఎదిగేందుకు సాయపడతాయని వివరించారు. గుండెపోటు తరువాత కొంత ఆలస్యంగానైనా ఈ మాక్రోఫేగస్‌లు గుండెను చేరుకుంటాయని.. వీటిల్లో కొన్ని పసిపిల్లల స్థాయి కణాలుగా మారతాయని కాకపోతే.. ఈ కణాలు గుండెను చేరుకునే సమయానికి అక్కడి కణాలన్నీ నాశనమైపోయిన కండరం దెబ్బతిని ఉంటుందని వివరించారు. గుండెపోటు తరువాత గుండె ఎలా ప్రవర్తిస్తుందో పూర్తిగా తెలుసుకోగలిగితే సరికొత్త, మరింత సమర్థమైన చికిత్సలు అందించేందుకు వీలేర్పడుతుందని.. ఈ పరిశోధనలు అందుకు ఉపయోగపడతాయని లొరెట్టా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment