సాక్షి,తిరుపతి(తుడా): తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో మరో గుండెమారి్పడి చికిత్సను వైద్యులు శనివారం విజయవంతంగా నిర్వహించారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన 12 ఏళ్ల బాలికకు 6 గంటలపాటు శ్రమించి గుండె మార్పిడిని విజయవంతంగా పూర్తిచేశారు. కొంతకాలంగా ఆ బాలిక గుండె సామర్థ్యం పూర్తిగా క్షీణించడంతో అనారోగ్యం బారినపడింది.
ఆమెకు గుండె మార్పిడి అనివార్యమని ఆస్పత్రి డైరెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి తేల్చారు. బాలిక పేరును ‘ఏపీ జీవన్‌దాన్’లో రిజిస్టర్ చేయించారు. కాగా, చెన్నైకు చెందిన 29 ఏళ్ల యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ కావడంతో యువకుడి కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకొచ్చారు. అతడి నుంచి సేకరించిన గుండెను తమిళనాడు, తిరుపతి జిల్లా పోలీసులు 2.32 గంటల్లో గ్రీన్ చానల్ ద్వారా హృదయాలయానికి తరలించి బాలికకు అమర్చారు. కార్యక్రమాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి పర్యవేక్షించారు.
చదవండి: ప్యాసింజర్ రైళ్లకు మంగళం
Comments
Please login to add a commentAdd a comment