6-year-old killed by leopard in Tirupati - Sakshi
Sakshi News home page

తిరుమలలో విషాదం.. ఆరేళ్ల చిన్నారిని బలితీసుకున్న చిరుత

Published Sat, Aug 12 2023 7:35 AM | Last Updated on Sat, Aug 12 2023 7:28 PM

Tirupati: Leopard Killed Girl At Tirumala - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమలలో విషాద ఘటన చోటు చేసుకుంది. అలిపిరి నడకమార్గంలో చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసింది. వివరాల్లోకి వెళితే.. అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్తుండగా.. శుక్రవారం రాత్రి ఆరేళ్ల చిన్నారి తప్పిపోయింది. ఈ క్రమంలో పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే శనివారం ఉదయం నరసింహ స్వామి ఆలయం వద్ద చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చిన్నారి ఒంటిపై తీవ్ర గాయాలు కూడా ఉన్నాయి. కాగా నెల కిత్రం ఐదేళ్ల చిన్నారిపై పులి దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అదే ప్రాంతంలోనే రక్షితపై చిరుత దాడి చేయడం గమనార్హం. ఈ ఘటన తిరుమలలో కలకలం రేపుతోంది.

చదవండి: Dr Radha Murder Case: డా.రాధా మర్డర్ కేసులో భర్తే హంతకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement