ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిశోర్
హృదయ వేదన
Published Mon, Oct 31 2016 10:32 PM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM
- ప్రాణాపాయ స్థితిలో సీనియర్ జర్నలిస్ట్ ఆర్‌ఎస్‌జీ కిశోర్
- హుద్రోగంతో ఆసుపత్రిలో పోరాటం
- ఆపన్నహస్తం కోసం ఎదురు చూపు
పదిమంది హుద్రోగ చిన్నారుల దీనస్థితిని వెలుగులోకి తెచ్చి, వారి జీవితాల్లో వెలుగునింపిన గుండె లయ తప్పోతుంది. ప్రజల సమస్యల పరిష్కారంలో పాతికేళ్లు శ్రమించిన ఓ హృదయం కాపాడమని వేడుకుంటోంది. మానవీయ కథనాలను ఎన్నో ప్రసారం చేసి, మావతావాదులను కదిలించిన ఆయననే చివరకు అపన్నహస్తం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చింది. పాత్రికేయుడిగా పలు ఆసక్తి కథనాలను వెలుగులోకి తెచ్చిన నంద్యాల ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ జర్నలిస్ట్ ఆర్‌ఎస్‌జీ కిశోర్ తీవ్ర హుద్రోగంతో కర్నూలు సర్వజన ఆసుపత్రిలో ప్రాణాపాయంతో పోరాడుతున్నారు.
- నంద్యాల
మూడు తరాలుగా జర్నలిజంలో ఉంటూ సేవలందిస్తున్న కుటుంబానికి చెందిన ఆర్‌ఎస్‌జీ కిశోర్ నంద్యాలలో తొలి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్. ప్రస్తుత గుండె సంబంధిత వ్యాధితో ప్రాణాలతో కొట్టుమిడ్డాతున్నారు. పాత్రికేయుడిగా పాతికేళ్లుగా పనిచేసినా బ్యాంక్ బ్యాలెన్స్‌లు పెట్టుకోలేని పరిస్థితి. అరకొరగా వచ్చే జీవితంతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఇద్దరు భార్యలు, ఆరుగురు సంతానం. అతనికి తల్లిదండ్రులు పేరు ప్రతిష్టలను, నైతిక విలువలు, మానవత్వాన్ని పంచిపెట్టారేకాని, ఆస్తులను ఇవ్వలేదు. ఆయన తండ్రి ఆర్‌వీ శేషాద్రి కర్నూలులో సీనియర్ జర్నలిస్ట్. ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు కోడి నరసింహం కుమార్తె శకుంతలమ్మ ఆయన తల్లి. ఆర్‌వీ శేషాద్రి పాతికేళ్లు జర్నలిస్ట్‌గా సేవలను అందించి, ఒక దినపత్రికలో చీఫ్ రిపోర్టర్ హోదాలో మృతి చెందారు. ఆయన స్ఫూర్తితో బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్) 1996 ఎలక్ట్రానిక్ మీడియా ప్రారంభమైన తొలి రోజుల్లోనే సిటీ కేబుల్ యాజమాన్యం సహకారంతో స్థానిక వార్తలకు శ్రీకారం చుట్టారు. పలు సంచలనాత్మక వార్తలను, మానవీయ కథనాలను ప్రసారం చేసి ఈ తరం ఎలక్ట్రానిక్ మీడియ జర్నలిస్ట్‌లకు స్ఫూర్తిగా నిలిచారు. 2010లో వ్యక్తిగత కారణాలతో సిటీ కేబుల్ నుంచి తప్పుకున్న ఆయన ప్రముఖ చానల్‌లో పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు పవన్ కళ్యాణ్ లోకల్ చాన్‌ల్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
దాతల కోసం నిరీక్షణ
మూడు దశాబ్దాలుగా జర్నలిజం వృత్తిలో ఉంటున్న కిషోర్ వారం క్రితం ఇంట్లో కళ్లు తిరిగి పడిపోవడంతో కుటుంబీకులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి గుండె బలహీనమై, తక్కువగా కొట్టుకుంటుందని సూచించడంతో కర్నూలు సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పేస్ మేకర్ ద్వారా గుండె ఆగకుండా ఆపారు. తర్వాత జరిపిన యాంజియోగ్రామ్ పరీక్షలో మూడు రక్తనాళాలు పాడై, బలహీనమయ్యాయి. బైపాస్ సర్జరీ, ఓపెన్ హార్ట్›సర్జరీ కూడా చేయలేని పరిస్థితి. ఆరోగ్యశ్రీ పథకం ఆదుకునే అవకాశాలు ఉన్నా పరిధి తక్కువగా ఉంది. మెరుగైన వైద్యం అందించాంటే కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు రూ. ఐదారు లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతున్నారు.
బ్యాంక్ అకౌంట్ నెం: 30728194177
భార్య: రంగా రేణుకదేవి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
Advertisement