సాక్షి, ముంబై: ప్రముఖ రచయిత, సీనియర్ జర‍్నలిస్టు అరుణ్‌సాధు (76) కన్నుమూసారు. గుండెపోటుతో చికిత్స పొందుతో సోమవారం ఉదయం ఆయన మరణించారు.
సియోన్ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో గుండె జబ్బు ( కార్డియోమియోపతి )తో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారని ఆసుపత్రి డీన్-ఇన్-ఛార్జ్ డాక్టర్ జయశ్రీ మాండ్కర్ తెలిపారు. అనేక వార్తాపత్రికలతో పనిచేసిన అరుణ సాధు హిందీ, ఇంగ్లీష్, మరాఠీలలో అనేక నవలలు వ్రాసారు. ముఖ‍్యంగా ముంబై దైనిక్, సింహాసన్ నవలలో ఆయన మంచి ప్రాచుర్యం పొందారు. అటు సాహిత్యాన్ని, ఇటు జర‍్నలిజాన్ని సమానంగా తనదైన శైలిలో ఏలిన ఆయన సాహిత్యంలో సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని సైతం అందుకున్నారు. దీంతోపాటు భారతీయ భాషాపరిషత్, ఎన్‌సీ కేల్కర్, ఆచార్య ఆత్రేయ అవార్డులు ఆయనకు లభించాయి. అనేక ష్టార్ట్ స్టోరీలతోపాటు ది రైజ్ ఆఫ్ శివసేన, వియత్నాం వార్, చైనీస్ విప్లవం ఆయన ఇతర పాపులర్ రచనలు.