విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పవన్‌కుమార్‌రెడ్డి
నెల్లూరు(బారకాసు): ఓ చిన్నారి గుండెకు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి సరికొత్త జీవితాన్ని ప్రసాదించారు సింహపురి ఆస్పత్రి వైద్యులు. ఇందుకు సంబందించిన వివరాలను గురువారం ఆ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యులు వెల్లడించారు. జిల్లాలోని మర్రిపాడు మండలం కదిరినాయుడపల్లికి చెందిన వెంకటరత్నం, రమాదేవిల కుమార్తె భవాని శరణ్య(9) గత కొన్నేళ్లుగా విపరీతమైన ఆయాసంతో బాధపడుతూ ఉంది. కాగా చిన్నారికి మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడు వైద్యులు గుండెలో రంధ్రం ఉందని గుర్తించారు.
అప్పట్లోనే పలు ఆస్పత్రులను సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చివరికి సింహపురి ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. దీంతో ఇక్కడి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విజయ్‌అమర్‌నాథ్‌రెడ్డి, కార్డియాక్ సర్జన్ డాక్టర్ కృష్ణప్రసాద్, అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ రాజమోహన్‌రెడ్డి కలసి, చిన్నారికి బైపాస్ సర్జరీ అవసరం లేకుండా పెర్క్యుతేనియస్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్(కాలు ద్వారా గుండెకు వైర్ పంపి స్ప్రింగ్ ద్వారా) రంధ్రాన్ని మూసివేశారు. ప్రస్తుతం చిన్నారి భవానిశరణ్య ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స నిర్వహించిన వైద్య బృందాన్ని యాజమాన్యం ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో ఆస్పత్రి మెడికల్ డైరక్టర్ డాక్టర్ పవన్‌కుమార్‌రెడ్డితో, భవానిశరణ్య తల్లితండ్రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment