
ప్రతీకాత్మక చిత్రం
లక్నో : వైద్యుల క్రూరత్వానికి ఓ చిన్నారి పాప బలైంది. హాస్పిటల్ బిల్లులు పూర్తిగా చెల్లించలేదన్న కారణంతో సర్జరీ తర్వాత కుట్లు వేయకుండా పాపను కుటుంబసభ్యులకు అప్పగించటంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంభి జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... కౌశాంభి జిల్లా మన్‌ఝాన్‌పూర్ టౌన్‌కు చెందిన మూడు సంవత్సరాల ఓ చిన్నారికి కొద్దిరోజుల క్రితం కడుపులో నొప్పి రావటంతో ప్రయాగ్ రాజ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
పాపను పరీక్షించిన వైద్యులు సర్జరీ చేయాలని తీర్మాణించారు. అనంతరం కుటుంబసభ్యుల అంగీకారంతో ఆపరేషన్ చేశారు. అయితే హాస్పిటల్ బిల్లులు మొత్తం కట్టలేదన్న కారణంతో సర్జరీ చేసిన చోట కుట్లు వేయకుండానే పాపును కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో పాప మరణించింది. ఓ వ్యక్తి ఇందుకు సంబంధించిన ఫొటోలు, వివరాలను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయటంతో సంఘటన వైరల్ అయింది. దీనిపై స్పందించిన వైద్యాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.
చదవండి : పాపం: 175 ఎకరాల ఆసామి నేడు కూలీగా..
Comments
Please login to add a commentAdd a comment