
గుండె జబ్బుల్ని ముందుగానే తెలుసుకుంటే మరణాలను నివారించడమే కాదు... చాలారకాల అనర్థాలను సమర్థంగా నివారించవచ్చు. నిజానికి ఏ వయసు నుంచి మహిళలు గుండె పరీక్షలను చేయించుకోవడం మంచిది అనే అంశంపై కొంతమంది నిపుణులైన కార్డియాలజిస్టులు చెబుతున్న మాటలేమిటో చూద్దాం.
మహిళలకు స్థూలకాయం, దేహ జీవక్రియలకు సంబంధించిన ఆరోగ్య రుగ్మతలు (మెటబాలిక్ డిజార్డర్స్), కుటుంబంలో (చాలా చిన్న వయసులోనే గుండె జబ్బులు (ప్రీ–మెచ్యూర్ హార్ట్ డిజీసెస్) కనిపిస్తుండటం వంటి ముపుప ఉన్నప్పుడు వారు తమ 20వ ఏటి నుంచే ప్రతి ఏటా బేసిక్ గుండె పరీక్షలైన ఈసీజీ, 2 డీ ఎకో వంటివి చేయించుకుని నిర్భయంగా ఉండటం సముచితమంటున్నారు పలువురు గుండెవైద్య నిపుణులు.
ఒకవేళ ఏవైనా గుండెజబ్బులకు కారణమయ్యే నిశ్శబ్దంగా ఉండు ముప్పు అంశాలు (సైలెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్) కనిపిస్తే వాటికి అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన చర్యలను ముందునుంచే తీసుకుంటూ ఉడటం, నివారణ చర్యలను పాటిస్తూ ఉండటం వల్ల ప్రాణాంతక పరిస్థితులను చాలా తేలిగ్గా నివారించవచ్చు. ఉదాహరణకు హైబీపీ లేదా రక్తంలో కొవ్వుల మోతాదులు ఎక్కువగా ఉండే డిస్‌లిపిడేమియా అనే పరిస్థితి ఉన్నట్లయితే వాటిని పట్టించుకోకపోవడం వల్ల కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీసే అవకాశముంటుంది. అదే పైన పేర్కొన్న ముప్పు ఉన్నవారైతే 20వ ఏటి నుంచీ లేదా అన్నివిధాలా ఆరోగ్యవంతులైన మహిళలు తమ 40 ల నుంచి గుండె పరీక్షలను తరచూ ( లేదా మీ కార్డియాలజిస్ట్ సిఫార్సు మేరకు) చేయించుకోవడం మంచిది.
అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎప్పుడూ పాటించడమనే అంశం కూడా గుండెజబ్బులతో పాటు చాలా రకాల జబ్బులు, రుగ్మతలను నివారించి మహిళలెప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చేయడానికి ఉపయోగపడుతుంది.
(చదవండి: