Heart-Stopping Moment A Boy Falls 40 Feet Off Zipline In Mexico - Sakshi
Sakshi News home page

40 మీటర్ల ఎత్తులో రోప్‌ ర్యాక్‌.. అమాంతం పడిపోయిన బాలుడు..

Published Fri, Jun 30 2023 6:52 PM | Last Updated on Fri, Jun 30 2023 9:05 PM

Heart Stopping Moment A Boy Falls 40 Feet Off Zipline In Mexico - Sakshi

మెక్సికోలో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. రోప్స్ ర్యాక్‌లో ఆరేళ్ల పిల్లాడు 40 మీటర్ల ఎత్తు నుంచి అమాంతం కిందపడిపోయాడు. అదృష్టవశాత్తు పిల్లాడు పడిపోయే ప్రదేశంలో చిన్న సరస్సు ఉండటంతో ప్రమాదం తప్పింది. మాంటెర్రేలోని ఫండిడోరా అమెజాన్ ఎక్స్‌పెడిషన్‌లో ఈ ఘటన జరిగింది. 

ఫండిడోరా అమెజాన్ ఎక్స్‌పెడిషన్‌లో కుటుంబంతో అందరూ కలిసి వచ్చారు. ఈ క్రమంలో రోప్స్‌ ర్యాక్‌ సాహస క్రీడలో పాల్గొనడానికి పిల్లలు వెళ్లారు. అందులో ఆరేళ్ల పిల్లాడు ముందుగా రోప్‌పై ప్రయాణించాడు. ఆ తర్వాత మరో వ్యక్తి రోప్‌పై వెళ్లాడు. ఇద్దరు ఒకే చోటుకు రావడంతో పిల్లాడు ఆందోళనకు గురయ్యాడు. అయినప్పటికీ తాడును పట్టుకుని వేలాడే ప్రయత్నం చేశాడు. అందరూ చూస్తుండగానే అబ్బాయి ఒక్కసారిగా కిందపడిపోయాడు. అక్కడ కింద చిన్న సరస్సు ఉండటంతో ప్రమాదం తప్పిపోయింది.

స్వల్ప గాయాలతో బయటపడిన బాధితున్ని అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. రోప్‌ ర్యాక్‌ నిర్వహణలో యాజమాన్యం సరిగా స్పందించలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలుడు ప్రదర్శించిన ధైర్యానికి అందరూ మెచ్చుకున్నారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: యుద్ధ వాతావరణంలో ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ..    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement