ప్రపంచంలోని ఏ దేశంలో లేనంతమంది గుండెజబ్బు బాధితులు మన దేశంలోనే ఉన్నారు. మన దేశంలో ఏటా కోటీ 79 లక్షలమంది గుండెజబ్బులతో చనిపోతున్నారు. కొన్ని జీవనశైలి మార్పుల ద్వారా గుండె జబ్బుల్ని చాలావరకు నివారించవచ్చు.
గుండెకు చేటు తెచ్చిపెట్టే ఆరు ముఖ్యమైన అంశాలు...
అధిక రక్తపోటు (హై–బీపీ) : ఇది ఓ సైలెంట్ కిల్లర్. దాదాపు 75% గుండెపోట్లకు కారణం. స్థూలకాయులు తమ బరువులో 10 శాతం తగ్గించుకున్నా ఏ మందులూ లేకుండానే హైబీపీని చాలావరకు అదుపు చేయవచ్చు.
మధుమేహం: డయాబెటిస్ ఉన్నవారు చాలావరకు గుండెజబ్బుల బారిన పడుతుంటారు. అందుకే 40 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ హెచ్‌బీఏ1సీ వంటి పరీక్షలను ఏడాదిలో కనీసం రెండుమూడుసార్లు చేయించుకోవాలి.
ఒంట్లో కొవ్వులూ, కొలెస్ట్రాల్ : ఆహారంలో కొవ్వులతో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) పెరిగి, గుండెకు చేటు తెచ్చిపెడుతుంది.
దేహంలో దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్ : చాలాకాలం పాటు ఒత్తిడికీ, ఇతర దీర్ఘకాలపు ఇన్ఫెక్షన్లకూ గురవుతూ ఉండటం, నిద్రలేమి, పొగతాగే అలవాట్లు రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినేందుకు దోహదపడతాయి. దాంతో రక్తంలోకి విషపూరితమైన రసాయనాలు విడుదలై రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి.
గుండెను దృఢంగా ఉంచుకోడానికి చేయాల్సినవి...
- లిఫ్ట్‌కు బదులు మెట్లు వాడటం.
- ఒకేచోట కూర్చోకుండా నడక... సామర్థ్యం మేరకు పరుగు లేదా జాగింగ్.
- కార్లూ, బైకులకు బదులు సైకిల్ వాడటం. ∙ఈత, తోటపని చేస్తూ ఉండటం. ∙పొగతాగడం, నిద్రలేమికి దూరంగా ఉండటం... ఇవన్నీ దేహానికీ, దాంతోపాటు గుండెకూ ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.
డా‘‘ ప్రదీప్ కె. రాచకొండ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జరీ.
(చదవండి: భార్య సిజేరియన్ వల్లే..అనారోగ్యానికి గురయ్యానంటూ ఓ భర్త)
Comments
Please login to add a commentAdd a comment