కోవిడ్ -19 శ్వాసకోశ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపడంతో రోజు రోజుకి మరణాల రేటు పెరుగుతూ పోతుంది. కోవిడ్ -19 రోగుల సంఖ్య పెరగడంతో ఇప్పుడు ఇతర అవయవ వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపుతుంది. కోవిడ్ -19 వెంటనే శ్వాసకోశ వ్యవస్థ చూపినప్పటికి, తర్వాత కాలంలో ఇది లాంగ్-కోవిడ్ అని పిలువబడే మరొక స్థితికి మారుతుంది. ఇప్పుడు ఈ లాంగ్-కోవిడ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్యులను, శాస్త్రవేత్తలను మరింత కలవరానికి గురిచేస్తుంది. కోవిడ్ -19 వచ్చిన రోగులలో కొందరు తర్వాత గుండె, మెదడు, మూత్రపిండాల వ్యాధులతో తిరిగి ఆసుపత్రులకు వస్తున్నట్లు కనుగొన్నారు.
కోలుకున్న రొగులు గుండెకు సంబందించిన విషయంలో తగు జాగ్రత్తలు వహించాలని వైద్యులు ఇప్పుడు సలహా ఇస్తున్నారు. లాంగ్-కోవిడ్ వ్యాది 2020లోనే మొదట నివేదించారు. కోవిడ్ -19 శరీరంపై దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాలను చూపిస్తున్నట్లు మరిన్ని ఆధారాలు లభిస్తున్నాయి. కోవిడ్ -19 వల్ల గుండె ప్రతికూల ప్రభావానికి గురైతున్నట్లు వివిధ అధ్యయనాలలో కనుగొనబడింది. లాన్సెట్ నివేదిక, జామా నివేదికలో ఇవి గమనించవచ్చు. కోవిడ్ -19 శరీరంలో తక్కువ ఆక్సిజన్ స్థాయి ఉన్నప్పుడు గుండెపై ఒత్తిడిని పెంచి గుండె కండరాలను బలహీనపరుస్తుంది. 8 నుంచి 12 శాతం గుండె పోటు కూడా వస్తుంది.
గుండెపై ఒత్తిడి పెరగడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇలా రక్త నాళాలపై పడే విపరీతమైన ఒత్తిడి కొరోనరీ ఆర్టరీ వ్యాధికి కారణమవుతుంది. కరోనా నుంచి కోలుకున్న రొగులు గుండెకు సంబందించి ఏమైన ఇబ్బంది కలిగితే వెంటనే గుండెకు సంబందించి పరీక్షలు చేయించుకోవడం మంచిది అని డాక్టర్లు సూచిస్తున్నారు. క్రింద చెప్పిన లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
- ఛాతిలో అసౌకర్యంగా ఉండటం
- చేతుల్లో నొప్పి లేదా ఒత్తిడి కలగడం
- వివరించలేని విదంగా విపరీతమైన చెమట పట్టడం
- హృదయ స్పందన సక్రమంగా పనిచేయక పోవడం
- శారీరక శ్రమ లేకున్న అధిక అలసట లేదా అలసట కలగటం
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment