
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: న్యూట్రాసూటికల్స్ తయారీ సంస్థ లీ హెల్త్ డొమెయిన్ గుండె సంరక్షణకై సహజ సిద్ధ మూలికలతో లైఫోస్టెరాల్ సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్‌ను తయారు చేసింది.
వెల్లుల్లి సారం, గామా ఒరిజనోల్, ఫైటోస్టెరాల్, లైకోపీన్, పసుపులో ఉండే కుర్కుమిన్, మెంతికూర, నల్ల మిరియాల నుంచి తీసిన పైపెరిన్‌తో వీటిని రూపొందించామని లీ హెల్త్ డొమెయిన్ డైరెక్టర్ ఆళ్ల లీలా రాణి తెలిపారు. ‘అత్యంత శక్తివంతమైన ఈ సమ్మేళనాలు కొలె్రస్టాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను సమతుల్యం చేస్తాయి. క్రమ రహిత హృదయ స్పందనలను స్థిరీకరిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడతాయి’ అని చెప్పారు. అమెజాన్, లీ హెల్త్ డొమెయిన్, ఫార్మసీలలో లైఫోస్టెరాల్ లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment