ప్రభుత్వ ఉపాధ్యాయుడితో భార్యకు వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య  | Husband Committed Suicide Because of His Wife’s Extra-Marital Affair - Sakshi
Sakshi News home page

ఎన్నిసార్లు చెప్పిన భార్య వినకపోవడంతో.. భర్త ఆత్మహత్య 

Published Mon, Aug 21 2023 12:10 AM | Last Updated on Sun, Aug 27 2023 4:13 PM

- - Sakshi

కరీంనగర్‌ రూరల్‌: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే మానసిక ఆందోళనగురైన ఓ భర్త పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్‌రూరల్‌ పోలీసుల కథనంమేరకు కరీంనగర్‌ మండలం చామనపల్లికి చెందిన భూసారపు అనిల్‌కుమార్‌(30)కు పదేళ్లక్రితం పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి మండలం కనగర్తికి చెందిన సౌజన్యతో వివాహమైంది. వీరికి కూతురు, కొడుకు ఉన్నారు.

సౌజన్యకు వివాహానికి ముందునుంచే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడితో సంబంధం ఉందనే కారణంతో పలుమార్లు పంచాయితీలు జరిగాయి. మంచిగా ఉంటానని పంచాయితీ పెద్దలకు సౌజన్య చెప్పినప్పటికీ.. వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఎన్నిసార్లు చెప్పిన తన భార్య వినకపోవడంతో మానసిక ఆందోళనకు గురైన అనిల్‌ ఈనెల 6న ఇంట్లో గడ్డి మందు తాగిపడిపోయాడు. గమనించిన తల్లి పుష్పలత, భార్య సౌజన్యలు వెంటనే ఆటోలో చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం మరుసటి రోజు ఇంటికి వెళ్లిన అనిల్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈనెల 9న కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

చికిత్స పొందుతున్న క్రమంలోనే భార్య వివాహే తర సంబంధమే తన చావుకు కారణమని సెల్ఫీ వీడియో తీసి పెద్దబావ శ్రీనివాస్‌కు పంపించాడు. ఈ క్రమంలోనే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి 2గంటలకు మృతిచెందాడు. తల్లి పుష్పలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రదీప్‌కుమార్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement