వి.కోట: మండలంలోని గోనుమాకులపల్లెలో గురువారం ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. గోనుమాకులపల్లెకు చెందిన నవీన్(27) కృష్ణాపురం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. ఆలస్యంగా గమనించిన కుటుంబసభ్యులు కిందికి దించి వి.కోట సీహెచ్‌సీకి తరలించారు. అతను అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణాలపై విచారణ చేస్తామని ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు.