నంద్యాల: పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బలవన్మరణానికి పాల్పడింది. ఎస్‌ఐ వెంకటరెడ్డి అందించిన సమాచారం మేరకు.. స్థానిక రోజా డీఎడ్ కళాశాల సమీపంలో నివాసం ఉంటున్న సౌభాగ్యలక్ష్మి(52) సంజామల మండలం ఆకుమల్ల ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈమె కుమారుడు విక్రమ సింహారెడ్డి హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ మూడు సంవత్సరాల క్రితం కుటుంబ సమస్యలలో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్యకు పాల్పడటంతో అప్పటి నుంచి సౌభాగ్యలక్ష్మి తీవ్ర మానసిక వేదనతో భాదపడుతోంది. సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఆమె బెడ్‌రూంలో నిద్రకు ఉపక్రమించింది. భర్త సుధాకర్‌రెడ్డి సోపాలోనే నిద్రపోయాడు. మానసిక క్షోభను ఎదుర్కొంటున్న సౌభాగ్యలక్ష్మి అర్ధరాత్రి బెడ్‌రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
మంగళవారం ఉదయం భర్త లేచి చూసే సరికి ఉరికి వేలాడుతుండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. ఈ మేరకు కోవెలకుంట్ల సీఐ నారాయణరెడ్డి, ఎస్‌ఐ వెంకటరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. మూడేళ్ల వ్యవధిలో కుమారుడు, భార్యను కోల్పోయి సుధాకర్‌రెడ్డి, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment