సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం ఇంకా కేబినెట్ ముందుకు రాకముందే ఈ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు విజయోత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం ఆయన స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. అమ్మ వరమిచ్చిందంటూ ప్రచార ఆర్బాటాలకు పోవడం శోచనీయమన్నారు. ‘తెలంగాణ తెచ్చేది మేమే.. ఇచ్చేది మేమే’ అంటున్న కాంగ్రెస్ నేతలు ఒకవేళ వెనక్కి వెళ్తే సచ్చేది కూడా ఆ పార్టీయేనని దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. యూపీఏ బిల్లు పెడితే తమ పార్టీ మద్దతునిస్తుందన్నారు. ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిందని విమర్శించారు. సైద్ధాంతిక భూమిక లేని కాంగ్రెస్ నిర్ణయం వల్ల రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
అక్రమాలపై సమాధానం చెప్పాలి..
రాష్ట్రంలోని అవినీతి కుంభకోణాలు, రైతుల ఆత్మహత్యలు, భూకబ్జాలు, అక్రమ కమీషన్లపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. వీటన్నింటికి బాధ్యత వహించి కిరణ్ కేబినెట్ జైలులో ఉండాలన్నా రు. ముంబైలో ఫొటో జర్నలిస్టుపై జరిగిన అత్యాచారాన్ని ఆయన ఖండించారు. నింది తుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు బూర్గుపల్లి రామచందర్‌రావు, పార్టీ రాష్ట్ర నాయకుడు విద్యాసాగర్, బీజేపీ, బీహెచ్‌పీ, బీజేవైఎం, బజరంగ్‌దళ్ జిల్లా నాయకులు వెన్నెల మల్లారెడ్డి, దూది శ్రీకాంత్‌రెడ్డి, గుండ్ల జనార్దన్, గంగాడి మోహన్‌రెడ్డి, జక్కుల వెంకటేశం, పెర్క ఎల్లయ్య, నరోత్తంరెడ్డి, జశ్వంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు
అప్పుడే సంబరాలా?
Published Mon, Aug 26 2013 3:46 AM | Last Updated on Fri, Sep 1 2017 10:07 PM
Advertisement
Advertisement