రైల్వే నెట్‌వర్క్ బలోపేతం | Strengthening of the railway network | Sakshi
Sakshi News home page

రైల్వే నెట్‌వర్క్ బలోపేతం

Published Thu, Aug 25 2016 1:50 AM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

రైల్వే నెట్‌వర్క్ బలోపేతం

రైల్వే నెట్‌వర్క్ బలోపేతం

- విజయవాడ-గూడూరు మధ్య రూ. 3,875 కోట్లతో మూడో లైను నిర్మాణం
- తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ మార్గంలో మూడో లైను
- బల్లార్షా-కాజీపేట్ మూడో లైనుకు రూ. 2,403 కోట్లు
 
 సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైల్వే నెట్ వర్క్‌ను మరింత పటిష్టపరిచే దిశగా కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 24,374.86 కోట్ల విలువైన 9 ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 9 రాష్ట్రాల్లో కీలక మార్గాల బలోపేతానికి నిర్ణయం తీసుకున్నారు.

 పలు కీలక రైల్వే నిర్ణయాలు:
► విజయవాడ జంక్షన్- గూడూరు జంక్షన్ మధ్య  రూ. 3,246.26 కోట్ల అంచనా వ్యయంతో 287.67 కి.మీ. మేర మూడో రైల్వే లైను నిర్మాణానికి ఓకే చెప్పారు. ఈ లైను పూర్తయ్యేందుకు రూ. 3,875.68 కోట్లు కావొచ్చని అంచనా. ఈ మార్గం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల గుండా వెళుతుంది. కృష్ణపట్నం, సమీప పోర్టుల నుంచి వస్తు రవాణా చేసుకునే  సామర్థ్యం పెంపు.
► తెలుగు రాష్ట్రాల నుంచి రైళ్లు ఢిల్లీకి వెళ్లే మార్గాల్లో కీలకమైన జంక్షన్ల మధ్య మూడో లైనును నిర్మించనున్నారు. ఇందులో భాగంగా కాజీపేట్-బల్లార్షా మధ్య 201.04 కి.మీ.ల మూడో లైను (రూ. 2,063.03 కోట్ల అంచనాతో) ఐదేళ్లలో పూర్తి చేయనున్నారు. తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహారాష్ట్ర గుండా ఈ మార్గం ఉంది.
► దక్షిణాది రాష్ట్రాల నుంచి ఢిల్లీ వెళ్లే మార్గంలోనే నాగ్‌పూర్-ఇటార్సీ జంక్షన్ మధ్య రూ. 2,449.91 కోట్ల అంచనా వ్యయంతో మూడో లైను (280 కిలోమీటర్లు) నిర్మాణానికి ఆమోదం. ఐదేళ్లలో పూర్తికి నిర్ణయం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement