Railway network
-
ప్రగతి సోపానాలు
1,01,500 కి.మీ మేర నెట్వర్క్ 7,112 రైల్వేస్టేషన్లు భారత రైల్వే : దేశ రైల్వే నెట్‌వర్క్‌ను 1951లో జాతీయం చేశారు. ప్రపంచంలో అత్యధిక నెట్వర్క్ కలిగిన దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. ప్రతిరోజు 2.3 కోట్ల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ను, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటెన్ రైల్వే, కాల్కా–షిమ్లా రైల్వే (మౌంటెన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా)లను ప్రపంచ వారసత్వ కేంద్రాలుగా యునెస్కో ప్రకటించింది. బంగారం: ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని దిగుమతి, కొనుగోలు చేస్తున్న దేశాల్లో ద్వితీయస్థానం. వజ్రాలు: ప్రపంచంలోని 90 శాతం వజ్రాలకు పాలిష్‌తో పాటు ఇతర ప్రక్రియలు నిర్వహిస్తున్న దేశం. తపాలా: 1,55,618 పోస్ట్ ఆఫీసులు, 5.66 లక్షల మంది ఉద్యోగులతో ప్రపంచంలోనే అత్యధిక పోస్టల్ నెట్వర్క్ ఉన్న దేశం. అల్లం: ప్రపంచంలోని అల్లం, కుసుమపువ్వు, దొండకాయల ఉత్పత్తిలో ప్ర«థమస్థానం. బియ్యం, గోధుమల ఉత్పత్తిలో ద్వితీయస్థానం. మహిళా శక్తి : రాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్, ప్రతిపక్షనేత వరకు దేశంలోని ముఖ్యమైన పదవులను మహిళలు అలంకరించారు. అయిదు పెద్ద రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగానూ మహిళలే ఉన్నారు. కేరళలోని కొడస్సెరీ పంచాయతీలో ఎన్నికైన మొత్తం ప్రజాప్రతినిధులంతా మహిళలే. మధ్యాహ్నభోజనం: దేశవ్యాప్తంగా 12.65 లక్షల పాఠశాలల్లో 12 కోట్ల మంది పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం అమలు. ఇది ప్రపంచలోనే పెద్ద పథకంగా నిలుస్తోంది. టెలికాం: టెలికాం కమ్యూనికేషన్ మార్కెట్లో ప్రపంచంలోనే రెండో స్థానం. సైన్యం: 13 లక్షల మంది సైన్యంతో ప్రపంచంలో మూడోస్థానం. పండ్లు: అరటి, మామిడి, బొప్పాయి, నిమ్మ, పనస, జామ, దానిమ్మలను అత్యధికంగా పండిస్తున్న దేశం. అత్యంత ఎత్తయిన మార్గం: లద్దాఖ్‌లోని ఖార్డుంగ్ లా 5,600 మీటర్ల ఎత్తులో మోటారు వాహనాలు వెళ్లగలిగిన ప్రపంచంలోనే ఎత్తయిన మార్గం. సినిమారంగం: ప్రపంచంలోనే అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న దేశం. కుంభ్‌మేళా: ప్రపంచంలోనే అతిపెద్దసంఖ్యలో (3 కోట్ల మంది) ప్రజలు పాల్గొనే తీర్థస్థానం కుంభ్‌మేళా. -
విజయవాడ రైళ్లు మళ్లింపు
- 20 నుంచి 28 వరకు అమలు - కేంద్రీకృత సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణ ప్రభావం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి విజయవాడకు రైల్వే సేవల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. విజయవాడ రైల్వేస్టేషన్లో కేంద్రీకృత సిగ్నలింగ్ వ్యవస్థ (రూట్ రిలే ఇంటర్‌లాకింగ్ సిస్టమ్) ఆధునీకరణ పనుల దృష్ట్యా ఈ నెల 20 నుంచి 28 వరకు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది.అతి పెద్ద రైల్వే జంక్షన్ అయిన విజయవాడకు అన్ని వైపుల నుంచి వచ్చే రైళ్లను దశలవారీగా నిలిపివేస్తూ, రూటు మళ్లిస్తూ కేంద్రీకృత సిగ్నలింగ్ వ్యవస్థ పనులు చేపట్టనున్నా రు. ఈ క్రమంలో ఈ నెల 20 నుంచి 28 వరకు విజయవాడ కేంద్రంగా రాకపోకలు సాగించే 241 రైళ్లను పూర్తిగా, 361 రైళ్లు పాక్షికంగా రద్దవుతాయి. మరో 215 రైళ్లను దారి మళ్లిస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి కాజీపేట్ మీదుగా విజయవాడ వైపు వెళ్లే రైళ్లు సైతం నిలిచిపోతాయి. ఈ దృష్ట్యా ప్రయాణికులు తమ ప్రయాణ తేదీలు, మార్గాలలో సైతం తగిన సవరణలు చేసుకోవడం మంచిదని దక్షిణమధ్య రైల్వే అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్-విజయవాడ రైల్వే నెట్‌వర్క్‌లో మార్పులు.... హైదరాబాద్-హౌరా మధ్య రాకపోకలు సాగించే ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ-విశాఖ మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్, సాయినగర్-కాకినాడ ఎక్స్‌ప్రెస్‌లు ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు విజయవాడ స్టేషన్‌కు వెళ్లవు. ఈ ట్రైన్లను ఏలూరు, విజయవాడ బైపాస్ కొండపల్లి స్టేషన్ల మీదుగా నడుపుతారు. ఆదిలాబాద్ నుంచి సికింద్రాబాద్ మీదుగా తిరుపతికి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ భువనగిరి, రాయగిరి, ఆలేరు, జనగామ, కాజీపేట్, ఖమ్మం, కొండపల్లి, విజయవాడ మార్గంలో కాకుండా పగిడిపల్లి, గుంటూరు, తెనాలి స్టేషన్ల మీదుగా తిరుపతికి రాకపోకలు సాగిస్తుంది. ముంబై సీఎస్టీ-భువనేశ్వర్ మధ్య సికింద్రాబాద్ మీదుగా నడిచే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ సేవలు విజయవాడ, కాజీపేట్ మార్గంలో నిలిచిపోనున్నాయి. కొండపల్లి-విజయవాడ బైపాస్ మార్గంలో గుడివాడ, రాజమండ్రి మీదుగా మళ్లిస్తారు. పట్నా-బెంగళూరు మధ్య నడిచే సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్, దర్భంగ-మైసూర్ బాగ్మతి ఎక్స్‌ప్రెస్, జమ్ముతావి-చెన్నై సెంట్రల్ మధ్య నడిచే అండమాన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. వరంగల్, విజయవాడ , ఒంగోలు, నెల్లూరు, గూడూరు మార్గంలో కాకుండా బల్లార్ష, వరంగల్, కాచిగూడ, డోన్, గుత్తి, రేణిగుంట మార్గంలో(ఈ నెల 20, 21 తేదీలలో మాత్రమే) రాకపోకలు సాగిస్తాయి. సికింద్రాబాద్-గుంటూరు మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-గూడూరు సింహపురి ఎక్స్‌ప్రెస్‌లు.. కాజీపేట్, ఖమ్మం మార్గంలో కాకుండా పగిడిపల్లి-నడికుడి మీదుగా గుంటూరుకు రాకపోకలు సాగిస్తాయి. నర్సాపూర్-నాగర్సోల్, విశాఖపట్టణం-హజ్రత్ నిజాముద్దీన్, సికింద్రాబాద్-మచిలీపట్నం, కాకినాడ-బెంగళూర్, హైదరాబాద్-విశాఖ గోదావరి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-కాకినాడ గౌతమి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-విశాఖ దురంతో ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-విశాఖ గరీబ్థ్,్ర సికింద్రాబాద్-కాకినాడ మధ్య నడిచే కాకినాడ ఎక్స్‌ప్రెస్, ముంబై లోకమాన్య తిలక్-విశాఖ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-కోల్కత్తా షాలిమార్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-విశాఖ జన్మభూమి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-గువాహటి, సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్,తదితర రైళ్లను విజయవాడ-కొండపల్లి బైపాస్ మార్గంలో, గుడివాడ-విజయవాడ బైపాస్ మార్గంలో నడుపుతారు. ఈ రైళ్లు విజయవాడ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగించవు. -
రైల్వే నెట్వర్క్ బలోపేతం
- విజయవాడ-గూడూరు మధ్య రూ. 3,875 కోట్లతో మూడో లైను నిర్మాణం - తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ మార్గంలో మూడో లైను - బల్లార్షా-కాజీపేట్ మూడో లైనుకు రూ. 2,403 కోట్లు సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైల్వే నెట్ వర్క్‌ను మరింత పటిష్టపరిచే దిశగా కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 24,374.86 కోట్ల విలువైన 9 ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 9 రాష్ట్రాల్లో కీలక మార్గాల బలోపేతానికి నిర్ణయం తీసుకున్నారు. పలు కీలక రైల్వే నిర్ణయాలు: ► విజయవాడ జంక్షన్- గూడూరు జంక్షన్ మధ్య రూ. 3,246.26 కోట్ల అంచనా వ్యయంతో 287.67 కి.మీ. మేర మూడో రైల్వే లైను నిర్మాణానికి ఓకే చెప్పారు. ఈ లైను పూర్తయ్యేందుకు రూ. 3,875.68 కోట్లు కావొచ్చని అంచనా. ఈ మార్గం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల గుండా వెళుతుంది. కృష్ణపట్నం, సమీప పోర్టుల నుంచి వస్తు రవాణా చేసుకునే సామర్థ్యం పెంపు. ► తెలుగు రాష్ట్రాల నుంచి రైళ్లు ఢిల్లీకి వెళ్లే మార్గాల్లో కీలకమైన జంక్షన్ల మధ్య మూడో లైనును నిర్మించనున్నారు. ఇందులో భాగంగా కాజీపేట్-బల్లార్షా మధ్య 201.04 కి.మీ.ల మూడో లైను (రూ. 2,063.03 కోట్ల అంచనాతో) ఐదేళ్లలో పూర్తి చేయనున్నారు. తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహారాష్ట్ర గుండా ఈ మార్గం ఉంది. ► దక్షిణాది రాష్ట్రాల నుంచి ఢిల్లీ వెళ్లే మార్గంలోనే నాగ్‌పూర్-ఇటార్సీ జంక్షన్ మధ్య రూ. 2,449.91 కోట్ల అంచనా వ్యయంతో మూడో లైను (280 కిలోమీటర్లు) నిర్మాణానికి ఆమోదం. ఐదేళ్లలో పూర్తికి నిర్ణయం.