ప్రగతి సోపానాలు
1,01,500 కి.మీ మేర నెట్‌వర్క్
7,112 రైల్వేస్టేషన్లు
భారత రైల్వే : దేశ రైల్వే నెట్‌వర్క్‌ను 1951లో జాతీయం చేశారు. ప్రపంచంలో అత్యధిక నెట్‌వర్క్ కలిగిన దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. ప్రతిరోజు 2.3 కోట్ల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ను, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటెన్ రైల్వే, కాల్కా–షిమ్లా రైల్వే (మౌంటెన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా)లను ప్రపంచ వారసత్వ కేంద్రాలుగా యునెస్కో ప్రకటించింది.
బంగారం: ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని దిగుమతి, కొనుగోలు చేస్తున్న దేశాల్లో ద్వితీయస్థానం.
వజ్రాలు: ప్రపంచంలోని 90 శాతం వజ్రాలకు పాలిష్‌తో పాటు ఇతర ప్రక్రియలు నిర్వహిస్తున్న దేశం.
తపాలా: 1,55,618 పోస్ట్ ఆఫీసులు, 5.66 లక్షల మంది ఉద్యోగులతో ప్రపంచంలోనే అత్యధిక పోస్టల్ నెట్‌వర్క్ ఉన్న దేశం.
అల్లం: ప్రపంచంలోని అల్లం, కుసుమపువ్వు, దొండకాయల ఉత్పత్తిలో ప్ర«థమస్థానం. బియ్యం, గోధుమల ఉత్పత్తిలో ద్వితీయస్థానం.
మహిళా శక్తి : రాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్, ప్రతిపక్షనేత వరకు దేశంలోని ముఖ్యమైన పదవులను మహిళలు అలంకరించారు. అయిదు పెద్ద రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగానూ మహిళలే ఉన్నారు. కేరళలోని కొడస్సెరీ పంచాయతీలో ఎన్నికైన మొత్తం ప్రజాప్రతినిధులంతా మహిళలే.
మధ్యాహ్నభోజనం: దేశవ్యాప్తంగా 12.65 లక్షల పాఠశాలల్లో 12 కోట్ల మంది పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం అమలు. ఇది ప్రపంచలోనే పెద్ద పథకంగా నిలుస్తోంది.
టెలికాం: టెలికాం కమ్యూనికేషన్ మార్కెట్‌లో ప్రపంచంలోనే రెండో స్థానం.
సైన్యం: 13 లక్షల మంది సైన్యంతో ప్రపంచంలో మూడోస్థానం.
పండ్లు: అరటి, మామిడి, బొప్పాయి, నిమ్మ, పనస, జామ, దానిమ్మలను అత్యధికంగా పండిస్తున్న దేశం.
అత్యంత ఎత్తయిన మార్గం: లద్దాఖ్‌లోని ఖార్‌డుంగ్ లా 5,600 మీటర్ల ఎత్తులో మోటారు వాహనాలు వెళ్లగలిగిన ప్రపంచంలోనే ఎత్తయిన మార్గం.
సినిమారంగం: ప్రపంచంలోనే అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న దేశం.
కుంభ్‌మేళా: ప్రపంచంలోనే అతిపెద్దసంఖ్యలో (3 కోట్ల మంది) ప్రజలు పాల్గొనే తీర్థస్థానం కుంభ్‌మేళా.