Live Updates
Time 18:17
► డ్యామ్ సేఫ్టీ బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలని రాజ్యసభలో ప్రతిపక్షాలు కేంద్రాన్ని కోరాయి.
Time 16:00
► దేశంలో వాయు కాలుష్య తీవ్రతను తగ్గించేందకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం ప్రభుత్వం తెలిపింది.
Time 12:20
►తెలంగాణలో వరి కొనగోలుకు సంబంధించిన అంశాన్ని టీఆర్‌ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు లోక్‌సభలో లేవనెత్తారు. నామా మాట్లాడుతూ.. కేంద్రం తీరుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణలో ధాన్యం సేకరించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు.
Time 11:40
►లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీల ఆందోళన
►ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలంటూ నిరసన
Time 11:20
► మధ్యాహ్నం 12 గంటల వరకు రాజ్యసభ వాయిదా
► పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి సస్పెండ్ చేసిన 12 మంది రాజ్యసభ ఎంపీల అంశం సభను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. నాలుగో రోజు కూడా రాజ్యసభలో 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలనే విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి.
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు గురువారం నాలుగో రోజు ప్రారంభమైంది. లోక్‌సభ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే టిఆర్ఎస్ ఎంపీల ఆందోళన చేయడం మొదలుపెట్టారు. పోడియం వద్ద ప్ల కార్డులతో నిరసన తెలుపుతున్నారు.
#WATCH | Congress MP Rahul Gandhi joins the Opposition leaders' protest against the suspension of 12 Opposition members of Rajya Sabha, in Delhi pic.twitter.com/w7Y1gSLTym
— ANI (@ANI) December 2, 2021
Comments
Please login to add a commentAdd a comment