
న్యూఢిల్లీ: పార్లమెంట్ భవనంలో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం ఉదయం 8 గంటల ప్రాంతంలో పార్లమెంటులోని 59వ గదిలో మంటలు చెలరేగాయి. అధికారులు తక్షణమే స్పందించడంతో కొద్దిసేపటికే అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేయగలిగాయి. ఈ ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉందని, ఈ ఘటననై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment