
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు మొదటి రోజు సోమవారం పలువురు ఎంపీలు పర్యావరణహితమైన సైకిళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలలో వచ్చారు. ముఖానికి మాస్క్‌లు ధరించారు. బీజేపీ ఎంపీలు మన్‌సుఖ్ మాండవీయ, మనోజ్ తివారీ సైకిల్‌పై రాగా, పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవడేకర్ ఎలక్ట్రిక్ కారులో వచ్చారు. ఢిల్లీ కాలుష్యంపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. సోమవారం రాజధానిలో కాలుష్యం కొంత మేర తగ్గినప్పటికీ నాణ్యత మాత్రం దారుణంగానే ఉంది.
కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రయాణాన్ని క్రమంగా ప్రోత్సహిస్తోందని ఈ సందర్భంగా మంత్రి ప్రకాశ్ జవడేకర్ తెలిపారు. ప్రజలు కూడా కాలుష్య నివారణకు తమ వంతు ప్రయత్నం చేయాలని కోరారు. ప్రజా రవాణా, ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని ప్రజలకు సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం రోజురోజుకు పెరుగుతుండటం పట్ల నాయకులతో పాటు సామాన్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
సైకిల్‌పై పార్లమెంట్‌కు వచ్చిన బీజేపీ ఎంపీ మన్‌సుఖ్ మాండవీయ
Comments
Please login to add a commentAdd a comment