
మూడో రోజు... మారని తీరు
న్యూఢిల్లీ: నోట్ల కష్టాలపై వరుసగా మూడో రోజు పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళం కొనసాగింది. అధికార, విపక్ష సభ్యుల వాదప్రతివాదాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్ సభ మధ్యాహ్నం 12 గంటల వరకు, రాజ్యసభ కూడా ఉదయం 11.30 గంటల వరకు వాయిదా వేశారు. తర్వాత సమావేశమైన పెద్దల సభ మధ్యాహ్నం 12 గంటల వరకు మరోసారి వాయిదా పడింది.
దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ క్షమాపణ చెప్పాలని పట్టుబట్టాలని అధికార పక్షం డిమాండ్ చేసింది. పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో పెద్దల సభలో గందరగోళం నెలకొంది. లోక్ సభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మరోవైపు సభలో ఉండాలని తమ ఎంపీలకు బీజేపీ మూడు లైన్ల విప్ జారీ చేసింది. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద తృణమూల్ ఎంపీలు ధర్నా చేశారు.