ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే పెట్టాలని ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అయితే, బిల్లుకు సంబంధించిన ప్రక్రియ నడుస్తోందని, అది పూర్తయితే బిల్లును తీసుకొస్తామని లోక్‌సభలో సభానాయకుడు, హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో సుష్మా, సాధ్యమైనంత త్వరగా బిల్లును పార్లమెంట్‌లో పెట్టాలని కోరారు.