లోక్‌సభ ఘటన.. పక్కా స్కెచ్‌తోనే ఎంట్రీ! | Security Breach On Parliament Attack Anniversary Updates | Sakshi
Sakshi News home page

Parliament Security Breach: పార్లమెంట్‌ దాడి ఘటన.. అప్‌డేట్స్‌

Published Wed, Dec 13 2023 2:22 PM | Last Updated on Wed, Dec 13 2023 8:57 PM

Security Breach On Parliament Attack Anniversary Updates - Sakshi

సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతుండగా బుధవారం ఇద్దరు యువకులు.. లోక్‌సభలో విజిటర్‌ గ్యాలరీ నుంచి దూకి మరీ వెల్‌ వైపు వెళ్లే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. ఈ క్రమంలో టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు వాళ్లు. అయితే సత్వరమే స్పందించిన ఎంపీలు వాళ్లను నిలువరించి భద్రతా సిబ్బందికి అప్పగించారు. 

👉పాస్‌లు ఎలా పొందారసలు?

🔺సభా కార్యకలాపాలు కొనసాగుతోన్న వేళ లోక్‌సభలోకి దూసుకొచ్చిన దుండుగులు
🔺సందర్శకులుగా వచ్చి దాడికి పాల్పడ్డ దుండగులు
🔺ప్రస్తుతానికి విజిటర్స్‌ పాస్‌ల జారీపై స్పీకర్‌ నిషేధం 
🔺ఎవరైనా పార్లమెంట్‌ను సందర్శించాలనుకుంటే..
🔺నియోజకవర్గానికి చెందిన పార్లమెంట్‌ సభ్యుడి పేరు మీద అభ్యర్థన చేసుకోవాలి
🔺మొదట ఎంపీలు ఈ అభ్యర్థన చేసుకున్న వ్యక్తులు సమర్పించిన  గుర్తింపు కార్డులు తనిఖీ చేస్తారు
🔺భద్రతాపరమైన పరిశీలన కూడా ఉంటుంది
🔺పార్లమెంట్ కార్యకలాపాలు వీక్షించేందుకు మూడు అంచెల భద్రతా వ్యవస్థను దాటాలి
🔺పార్లమెంటు ప్రవేశద్వారం వద్ద మోహరించిన సిబ్బంది, ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా కఠినమైన భద్రతా తనిఖీ తర్వాతే వారు లోపలికి వెళ్తారు
🔺ప్రస్తుతం విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఇద్దరు దుండగులది కర్ణాటక
🔺మైసూర్‌ ఎంపీ ప్రతాప్‌ పేరు మీద జారీ అయిన పాస్‌లు
🔺దీంతో రాజకీయ విమర్శలు
🔺పాస్‌లు జారీ బాధ్యతారాహిత్యమని.. క్షమార్హమైంది కాదంటున్న విపక్షాలు
🔺పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి వాదన వినిపించనున్న బీజేపీ ఎంపీ 
🔺కొత్త పార్లమెంట్ వీక్షిస్తామనే వంకతో వారు పాస్‌లు పొందినట్లు సమాచారం
🔺మూడు నెలలపాటు ప్రయత్నించి ఈ పాస్‌ పొందినట్లు గుర్తింపు 


👉రాజకీయం తగదు: కేంద్ర మంత్రి గోయల్‌

🔺లోక్‌సభ ఘటనపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలంటున్న విపక్షాలు
🔺రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్‌ 
🔺దాడి జరిగింది లోక్‌సభనా? రాజ్యసభనా? అని చూడొద్దంటున్న విపక్షాలు
🔺ఘటనపై ఎప్పటికప్పటి సమాచారం.. దర్యాప్తు వివరాలను తెలియజేస్తానని సభ్యులకు రాజ్యసభ చైర్మన్‌ హామీ
🔺అయినా తగ్గని సభ్యులు
🔺హోం మంత్రి ప్రకటనకై పట్టు 
🔺విపక్ష సభ్యుల డిమాండ్‌ను తోసిపుచ్చిన పీయూష్‌ గోయల్
🔺పెద్దల సభ.. హుందాగా ఉండాలని పిలుపు 
🔺ఇలాంటి సమయాల్లో మనమంతా ఐక్యమనే సందేశాన్ని ఇవ్వాలన్న గోయల్‌
🔺కాంగ్రెస్‌, విపక్షాలు దీనిని రాజకీయం చేస్తున్నాయని మండిపాటు 
🔺ఇది మంచి సందేశం కాదని విమర్శ

👉 దర్యాప్తులో కీలక విషయాలు

🔺పార్లమెంట్‌ దాడి ఘటన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి
🔺నిందితులు మొత్తం ఆరుగురిగా తేల్చిన అధికారులు
🔺పరారీలో మరో ఇద్దరు
🔺ఇప్పటికే పోలీసుల అదుపులో నలుగురు
🔺పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు
🔺నాలుగు నెలల కిందటే దాడికి ప్లాన్‌ గీసినట్లు సమాచారం
🔺పూర్తి వివరాలు మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం

👉 ఫుల్‌బాడీ స్కానర్లు పెట్టండి: లోక్‌సభ స్పీకర్‌

🔺హోంశాఖకార్యదర్శికి స్పీకర్‌ ఓం బిర్లా లేఖ
🔺పార్లమెంట్‌ సెక్యూరిటీని పూర్తిగా ప్రక్షాళన చేయాలి
🔺ఎంట్రీ గేట్ల వద్ద ఫుల్‌ బాడీ స్కానర్లు ఏర్పాటు చేయాలి
🔺పార్లమెంట్‌ పరిసరాల్లో భద్రతను పెంచాలని లేఖలో కోరిన స్పీకర్‌

🔺పార్లమెంట్‌ లోక్‌సభ దాడి ఘటనపై సన్‌సద్‌మార్గ్‌లోని పీఎస్‌లో కేసు నమోదు

👉  ముగిసిన అఖిలపక్ష సమావేశం

🔺పార్లమెంట్‌ సెక్యూరిటీపై సభ్యుల ఆందోళన
🔺హైపవర్‌ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం


👉 లోపలా బయట ఆధారాల సేకరణ

🔺లోక్‌సభ ఘటన నేపథ్యంలో పార్లమెంట్‌కు చేరుకున్న ఫోరెన్సిక్‌ బృందం
🔺పార్లమెంట్‌ లోపలా, బయట ఆధారాలు సేకరిస్తున్న క్లూస్‌ టీం
🔺నలుగురు నిందితుల్ని విచారిస్తున్న దర్యాప్తు సంస్థలు, ఢిల్లీ పోలీసులు
🔺రాత్రికల్లా దాడి గురించి స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం

👉 పార్లమెంట్‌లో మొదలైన అఖిలపక్ష సమావేశం

🔺లోక్‌సభ ఘటన నేపథ్యంలో పార్లమెంట్‌లో జరుగుతున్న అఖిలపక్ష సమావేశం
🔺వివిధ పార్టీల నుంచి హాజరైన లోక్‌సభ, రాజ్యసభ నేతలు
🔺భద్రతా వైఫల్యం, ఘటన కారణాలపై సమీక్ష
🔺రాజ్యసభలోనూ దాడి ఘటనను ప్రముఖంగా చర్చించిన కాంగ్రెస్‌


👉ఎత్తు తగ్గించడం వల్లే..: ఎంపీ గోరంట్ల మాధవ్‌

🔺స్పీకర్ చైర్ వైపు అగంతకుడు దూసుకొచ్చే ప్రయత్నం చేశాడు
🔺దాడి చేసే ప్రయత్నం చేశాడు
🔺అతను బెంచీలు దాటుకొని వచ్చే ప్రయత్నం చేశారు 
🔺ఎదురుగా వెళ్లి అతనిని నేరుగా పట్టుకున్నా
🔺పట్టుకున్న వెంటనే బూట్ల నుంచి టియర్ గ్యాస్ బయటకు తీశారు 
🔺సందర్శకుల గ్యాలరీ ఎత్తు తగ్గించడం వల్ల సులభంగా లోపలికి ప్రవేశించాడు
🔺సందర్శకుల గ్యాలరీకి గ్లాస్ బిగించాలి 
🔺ఇది కచ్చితంగా తీవ్రమైన భద్రత వైఫల్యమే
🔺లోక్‌సభలో అలజడి సృష్టించిన అగంతకుడిని పట్టుకున్న వైఎస్సార్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్
🔺ఎదురుగా వెళ్లి అగంతకుడిని పట్టుకున్న మాధవ్ 
🔺మాధవ్‌తో పాటు ఎంపీ గుర్జిత్‌, ఇతర ఎంపీలు కూడా ఆగంతకుల్ని నిలువరించే యత్నం

🔺పార్లమెంట్‌కు చేరుకున్న ఫోరెన్సిక్‌ బృందం

👉బీజేపీ ఎంపీ పేరు మీదే పాస్‌!

🔺మైసూర్‌ ఎంపీ ప్రతాప్‌ సింహా పేరు మీద పాస్‌ తీసుకున్న సాగర్‌ శర్మ!
🔺వివేకానంద ఇనిస్టిట్యూట్‌లో చదువుతున్న సాగర్‌ శర్మ, మనోరంజన్‌లు
🔺బెంగళూరు వెళ్తున్నామని చెప్పి మూడు రోజుల కిందట ఇంటి నుంచి బయల్దేరిన ఈ ఇద్దరూ
🔺బీజేపీ మైసూర్‌ ఎంపీ పేరు మీద విజిటర్స్‌ పాస్‌ తీసుకున్న వైనం
🔺విజిటర్స్‌ పాస్‌లు రద్దు చేసిన స్పీకర్‌



👉లోక్‌సభ ఘటన నిందితుల గుర్తింపు

🔺పార్లమెంట్‌ లోపల దాడికి పాల్పడిన ఇద్దరు ఆగంతకుల్ని గుర్తించిన ఢిల్లీ పోలీసులు
🔺సాగర్‌ శర్మ, మనోరంజన్‌గా గుర్తింపు
🔺బయట రంగుల టియర్‌గ్యాస్‌తో నినాదాలు చేసింది నీలమ్‌కౌర్‌(హిస్సార్‌-హర్యానా), ఆమోల్‌ షిండే(లాతూర్‌-మహారాష్ట్ర)గా గుర్తింపు
🔺పోలీసుల అదుపులో ఈ నలుగురు
🔺ప్రశ్నిస్తున్న ఢిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు
🔺దాడికి గల కారణాలపై ఆరా


ఇదీ చదవండి: లోక్‌సభలో టియర్‌ గ్యాస్‌ అలజడి..పరుగులు తీసిన ఎంపీలు 

👉 కాసేపట్లో అఖిలపక్ష భేటీ

🔺పార్లమెంట్‌లో దాడి ఘటనపై కాసేపట్లో అఖిలపక్ష సమావేశం
🔺భద్రతా వైఫల్యం, ఘటనకు కారణాలపై సమీక్ష
🔺ఇప్పటికే పార్లమెంట్‌కు చేరుకున్న ఢిల్లీ సీపీ, హోం సెక్రటరీ అజయ్‌భల్లా 
🔺 దాడి ఘటనతో విజిటర్‌ పాస్స్‌ రద్దు చేసిన స్పీకర్‌

జీరో అవర్‌ జరుగుతుండగా గ్యాలరీ నుంచి దూకి మరీ వెల్‌ వైపు వెళ్లే యత్నం చేశారు.  బూట్లలో రంగుల టియర్‌గ్యాస్‌ బుల్లెట్లను బయటకు తీసి ప్రయోగించారు. లోక్‌సభలో ‘జైభీమ్‌, భారత్‌ మాతాకీ జై’ తానా షాహీ బంద్‌ కరో.. నినాదాలు చేస్తూ వెల్‌ వైపు వెళ్లేందుకు యత్నించారు. ఆగంతకుల చర్యతో బిత్తరపోయారు ఎంపీలంతా.  అయితే అప్పటికే ఎంపీలు, భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యి వాళ్లను పట్టుకున్నారు. ఎంపీల ఆందోళనతో కాసేపు సభను వాయిదా వేశారు స్పీకర్‌. 

లోక్‌సభలో లోపల దాడికి పాల్పడిన వాళ్ల గురించి తెలియాల్సి ఉంది. అదే సమయంలో పార్లమెంట్‌ బయట నినాదాలు చేస్తూ కనిపించిన ఇద్దరిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. పసుపు రంగు టియర్‌గ్యాస్‌తో వీళ్లు ‘‘రాజ్యాంగాన్ని కాపాడాలి..’’, ‘‘నియంతృత్వం చెల్లదు’’ అంటూ నినాదాలు చేశారు. 
నిందితులను హర్యానాకు చెందిన నీలం కౌర్‌(42), మహారాష్ట్రకు చెందిన అమోల్‌ షిండే(25)గా గుర్తించారు. ఈ నలుగురు ఒకే గ్రూప్‌కు చెందిన వారై ఉంటారని.. ఇద్దరు లోపల, ఇద్దరు బయట నిరసనలు తెలియజేసే యత్నం చేసి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు.. ఘటన తర్వాత కాసేపటికే సభ ప్రారంభమైంది. లోక్‌సభలో అలజడి సృష్టించిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. ఆగంతకులు వదిలిన పొగ ప్రమాదకరమైంది కాదని.. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిగేలా చూస్తామని.. ఇప్పటికే ఢిల్లీ పోలీసులను ఆదేశించామని, విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని ఎంపీలతో స్పీకర్‌  అన్నారు.

సుమారు రూ.20వేల కోట్లతో నిర్మించిన నూతన పార్లమెంట్‌ భవన్‌లో తాజా ఘటనతో భద్రతా వైఫ్యలం బయటపడింది. భద్రతా తనిఖీని తప్పించుకుని వాళ్లు లోపలికి టియర్‌గ్యాస్‌తో ఎలా వెళ్లారనే? ప్రశ్నలు లేవనెత్తుతున్నారు పలువురు. మైసూర్‌ ఎంపీ ప్రతాప్‌ సింహా పేరిట పాస్‌లు తీసుకుని ఆగంతకులు లోపలికి ప్రవేశించినట్లు ప్రచారం తెరపైకి వచ్చింది. పోలీసులు దీనిని ధృవీకరించాల్సి ఉంది.

ఈ ఘటనపై విపక్ష ఎంపీలు స్పందిస్తూ పార్లమెంట్‌లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఇద్దరు వ్యక్తులు గ్యాలరీ నుంచి వచ్చి పసుపు రంగు గ్యాస్‌ను వదిలారు. ఎంపీలు వెంటనే వారిని పట్టుకున్నారు. ఈ ఘటనతో కొత్త పార్లమెంట్‌ భవనంలో భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి’’ అని పలువురు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగానే.. విపక్షాలు బీజేపీపై విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఢిల్లీ పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. 

ఖలిస్థానీల పనేనా?
పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి సరిగ్గా నేటికి 22 ఏళ్లు పూర్తైంది. ఇదే రోజున ఈ దాడి జరగడం గమనార్హం. మరోవైపు త్వరలో భారత్‌లో దాడులకు పాల్పడతామని కెనడాకు చెందిన ఖలీస్థానీ సంస్థలు ప్రకటించాయి. దీంతో ఇవాళ్టి దాడికి, ఖలీస్థానీకి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోందని అధికారులు అంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement