ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదని, ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరిగిన తీరుపై యావత్ భారతదేశం అసంతృప్తిగా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గత నవంబర్ 26న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ముగిశాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిన తర్వాత వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు.