
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. భేటీ అనంతరం ప్రధాని మాట్లాడుతూ... పార్లమెంట్ సమావేశాలు ప్రశాంతంగా జరుగుతాయని ఆశిస్తున్నామన్నారు. సభలో గొడవ కన్నా, చర్చలపై దృష్టి సారిస్తే మంచిదని ఆయన అన్నారు. అన్ని సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మోదీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment