పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఎలాంటి చర్చ జరగకుండా వాయిదా పడుతున్నాయి. నోట్లరద్దుపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు, విపక్షాలపై చేయి అడ్డుకునేందుకు అధికార పక్షం ప్రయత్నించటంతో బుధవారం కూడా కార్యక్రమాలు స్తంభించాయి. ఈ పరిస్థితిపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ మండిపడ్డారు. ఇరు పక్షాలు ఆందోళన పక్కనపెట్టాలని సూచించారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మలపై మండిపడ్డారు. విపక్షాల ఆందోళనతో సభ మధ్యాహ్నం రెండు గంటలవరకు రెండుసార్లు వాయిదా పడింది. తర్వాత సభ ప్రారంభం కాగానే, ఆనంద్ శర్మను పారుుంట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తేందుకు అనుమతిచ్చారు.