
సజావుగా పార్లమెంట్ సమావేశాలు: మోదీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగుతాయని ఆశిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ముఖ్యమైన అంశాలను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రతిపక్షాలు కలిసిరావాలని ఆయన కోరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆయనీ విజ్ఞప్తి చేశారు.
మరోవైపు ప్రభుత్వాన్ని నిలదేసేందుకు విపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. బీమా రంగంలో ఎఫ్ డీఐ పెంపు వ్యతిరేకిస్తామని జేడీ(యూ), సీపీఎం, బీఎస్పీ, ఎస్పీ ప్రకటించాయి. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ మద్దతు కోరతామని తెలిపాయి.