న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలను ఈసారి కాస్త ముందుగానే ప్రారంభించాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలనుకుంటున్న జీఎస్టీకి అనుబంధ బిల్లులైన సీజీఎస్టీ, ఐజీఎస్టీలకు ఇంకా ఆమోదం పొందాల్సి ఉన్నాయి. వార్షిక బడ్జెట్‌ను కూడా సాధారణం కన్నా ఈ ఏడాది కొంచెం ముందుగానే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో నవంబరు తొలి పక్షంలోనే సమావేశాలను ప్రారంభించేందుకు ఉన్న మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఈ విషయంపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ సమావేశం నిర్వహిస్తుండగా, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గ సంఘం 13వ తేదీన భేటీ అవుతోంది. రెండు భేటీల అనంతరం పార్లమెంటు శీతాకాల సమావేశాలను ఎప్పటినుంచి మొదలుపెడతారో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా శీతాకాల సమావేశాలు నవంబరు 3వ లేదా 4వ వారంలో ప్రారంభమవుతాయి.
కాస్త ముందుగానే శీతాకాల సమావేశాలు!
Published Wed, Oct 5 2016 6:49 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
Advertisement
Advertisement