Anant Kumar
-
నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
-
సీఎంపై విమర్శలు.. కేంద్రమంత్రిపై కేసు!
సాక్షి, బెంగళూరు: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు ఊపందుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో నేతలు అదుపుతప్పి ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలకు దూషణలు దిగుతున్నారు. మొత్తానికి కర్ణాటకలో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చినట్టు కనిపిస్తోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కర్ణాటకలో మత ఉద్రిక్తతలను పెంచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. మరోవైపు బీజేపీని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్తో పోలుస్తూ కర్ణాటక హోమంత్రి రామలింగారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'కర్ణాటకలో బీజేపీ నేతలు ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారు. వారు ఐఎస్ఐఎస్ తరహాలో ఉన్నారు. అమిత్ షా వారి అధిపతి' అని రామలింగారెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మరోవైపు ఇటీవల ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై నిందాత్మక వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అనంత్‌కుమార్ హెగ్డేపై కేసు నమోదైంది. ముఖ్యమంత్రిని కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఐపీసీ సెక్షన్లు 153, 504 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. -
కాస్త ముందుగానే శీతాకాల సమావేశాలు!
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలను ఈసారి కాస్త ముందుగానే ప్రారంభించాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలనుకుంటున్న జీఎస్టీకి అనుబంధ బిల్లులైన సీజీఎస్టీ, ఐజీఎస్టీలకు ఇంకా ఆమోదం పొందాల్సి ఉన్నాయి. వార్షిక బడ్జెట్‌ను కూడా సాధారణం కన్నా ఈ ఏడాది కొంచెం ముందుగానే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో నవంబరు తొలి పక్షంలోనే సమావేశాలను ప్రారంభించేందుకు ఉన్న మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయంపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ సమావేశం నిర్వహిస్తుండగా, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గ సంఘం 13వ తేదీన భేటీ అవుతోంది. రెండు భేటీల అనంతరం పార్లమెంటు శీతాకాల సమావేశాలను ఎప్పటినుంచి మొదలుపెడతారో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా శీతాకాల సమావేశాలు నవంబరు 3వ లేదా 4వ వారంలో ప్రారంభమవుతాయి. -
భార్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త
చంఢీగడ్: భార్యను తుపాకీతో కాల్చి చంపి అనంతరం తనుకు తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ పోలీసు కానిస్టేబుల్. ఆ ఘటనలో భార్య మృతి చెందగా, కానిస్టేబుల్ మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ సంఘటన చంఢీగడ్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... అనంతకుమార్ పోలీసు కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడని... అతడి భార్య డింపుల్ ఆసుపత్రిలో ఉద్యోగిగా పని చేస్తుందని తెలిపారు. అయితే ఇద్దరు మధ్య గత కొద్ది కాలంగా మనస్పర్థలు ఉన్నాయని... ఈ నేపథ్యంలో ఆ ఘటన చేసుకుని ఉంటుందని చెప్పారు. కానిస్టేబుల్ అనంతకుమార్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.