
సోనియా ఆరోగ్యంపై మోదీ ఆరా
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో విపక్ష నాయకులను పలకరించారు. లోక్ సభలోకి అడుగుపెట్టగానే ముందుగా బీజేపీ, మిత్రపక్ష నాయకులను విష్ చేశారు. ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, రాంవిలాస్ పాశ్వాన్, అశోక్ గజపతిరాజును పలకరించారు.
హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ తో కలిసి ప్రతిపక్ష నాయలకు బెంచీలవైపు వెళ్లారు. సోనియాగాంధీని పలకరించి కుశలప్రశ్నలు వేశారు. ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీశారు. తర్వాత తృణమూల్ కాంగ్రెస్ నాయకులు సుదీప్ బందోపాధ్యాయ, కళ్యాణ్ బెనర్జీలతోనూ మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ తంబిదురై, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేను ప్రధాని పలకరించారు. సోనియాతో రాజ్ నాథ్ చాలాసేపు మాట్లాడారు. సభ వాయిదా పడిన తర్వాత ప్రధాని మోదీని అభినందించేందుకు బీజేపీ ఎంపీలు పోటీ పడ్డారు.