న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై చర్చించేందుకు సమావేశమైన కేంద్ర కేబినెట్ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ భేటీ ముగిసింది. శీతాకాల సమావేశాల తేదీలపై ఈ భేటీలో స్పష్టం కాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి సమావేశం కావాలని కేంద్ర కేబినెట్ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. దీంతో త్వరలో మరోసారి ఈ కమిటీ భేటీ కానుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై చర్చించేందుకు ఈ కమిటీ బుధవారం న్యూఢిల్లీలో భేటీ అయిన సంగతి తెలిసిందే.