నీట్‌ అంశంపై దద్దరిల్లిన లోక్‌సభ.. సోమవారానికి వాయిదా | Parliament Sessions Fifth Day Live Updates | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం.. లైవ్‌ అప్‌డేట్స్‌

Published Fri, Jun 28 2024 9:38 AM | Last Updated on Fri, Jun 28 2024 12:18 PM

Parliament Sessions Fifth Day Live Updates

Live Updates..

👉లోక్‌సభలో మళ్లీ గందరగోళ పరిస్థితి నెలకొంది. 

👉నీట్‌పై చర్చకు విపక్ష నేతలు పట్టు. నీట్‌పై చర్చకు ప్రధాని మోదీ రావాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. .

👉సభలో నినాదాలు దద్దరిల్లడంతో లోక్‌సభ సోమవారానికి వాయిదా

👉రాజ్యసభలో నీట్‌పై గందరగోళం నెలకొంది. 

👉సభలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తున్నారు. 

 

వాయిదా అనంతరం ఉభయ సభలు ప్రారంభం.

👉నీట్‌పై చర్చకు డిమాండ్‌ చేసిన ప్రతిపక్షాలు.. లోక్‌సభలో గందరగోళం

👉 ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా

 

 

 

👉పార్లమెంట్‌ సమావేశాలు ఐదోరోజు ప్రారంభమయ్యాయి. 

👉రెండు సభల్లో నీట్‌పై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో, గందరగోళం నెలకొంది. 

👉అంతకుముందు రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. 

👉నీట్‌పై రాజకీయాలొద్దు..

👉నీట్‌పేపర్‌పై సమగ్ర చర్చ జరగాలి

👉ఆ తర్వాతే రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించాలి.

👉నీట్‌ పేపర్‌ లీకులపై లోక్‌సభలో చర్చకు కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం

👉వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్కం ఠాగూర్‌

👉పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ విఫలంపై చర్చకు డిమాండ్‌ చేసింది

👉పార్లమెంట్‌ సమావేశాలు నేడు(ఐదో రోజు) కొనసాగను​న్నాయి. ఈ సందర్భంగా ఈరోజు సభలో ప్రతిపక్షాలు ‘నీట్‌’ అంశంపై చర్చించే అవకాశం ఉంది. నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌ విషయంలో ప్రభుత్వంపై విరుచుకుపడే ఛాన్స్‌ ఉంది.

👉సమాచారం మేరకు.. ఉభయ సభలలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ప్రతిపక్షాలు నీట్ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. శుక్రవారం లోక్‌సభలో ప్రతిపక్షాలు నీట్‌ అంశాన్ని ప్రస్తావిస్తే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమాధానం ఇవ్వనున్నారు.  

👉ఇక, నిన్న ఇండియా కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ.. ఇది ప్రభుత్వం స్పందించాల్సిన సమయం. మేము నీట్ అంశంపై చర్చ కోసం కట్టుబడి ఉన్నాము అంటూ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు కూడా లోక్‌సభ సభ్యులు ప్రమాణం సందర్భంగా సభలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఎన్డీయే కూటమి సభ్యులు ప్రమాణానికి వెళ్తున్న సమయంలో నీట్‌.. నీట్‌.. అంటూ నినాదాలు చేశారు. ఇదిలాఉండగా.. నీట్‌ పేపర్‌ లీక్‌ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. భారీ సంఖ్యలో విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement